Advertisement
విక్రమ్ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఖైదీ ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం విక్రమ్. భారీ అంచనాల మధ్యన విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫజిల్ మరియు సూర్య కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రలో కనిపించాడు హీరో సూర్య. విక్రమ్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆఖరి ఐదు నిమిషాలు మరొక ఎత్తు.
Advertisement
Read also: కొత్త సినిమాలు ఎందుకు శుక్రవారం రోజునే విడుదల అవుతాయో తెలుసా..?
ఈ చిత్రంలో మెయిన్ విలన్ అయిన రోలెక్స్ పాత్ర ఆఖరి 5 నిమిషాలలోనే ఎంటర్ అవుతుంది. దీంతో పార్ట్ – 2 కి కూడా లీడ్ ఇచ్చారు దర్శకుడు. అయితే ఈ మూవీలో కమల్ హాసన్ మనవడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటినుండి చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన చిన్నపిల్లాడు ఎవరా అని చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా అంతటా కనిపించే చిన్నపిల్లాడి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశాక ఇప్పుడు మనం సినిమాలో చూసిన బాబు సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ బాబు పేరు దర్శన్. అతని తల్లి పేరు అభినయ.
Advertisement
అయితే ఒక సందర్భంలో బేబీ దర్శన్ తల్లి అభినయ మాట్లాడుతూ.. “విక్రమ్ చిత్రంలో మా బాబును చూసి చాలా ఆనందంగా ఉంది. అది కూడా కమల్ సార్ పక్కన ఫుల్ లెన్త్ రోల్ చేయడం అంటే గర్వపడాల్సిన విషయమే. మా ఆయన ఇండస్ట్రీలోనే కాస్టింగ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారు. అలాగే మా మరిది సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తూ ఉంటారు. మా మరిదికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో మంచి పరిచయం ఉంది. ఆ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరిగే సమయంలో మా బాబు గురించి లోకేష్ కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబును ఆడిషన్స్ కి తీసుకువెళ్ళాం. అలా సెలెక్ట్ అయిపోయారు” అని చెప్పుకొచ్చింది.
Read also: విమానాల్లో ప్రయాణం చేసేప్పుడు ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు ఉంచాలి ? లేకుంటే ఏమి జరగుతుంది ?