Advertisement
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి తెలియని వారు ఉండరు. అయితే ఆయన అసలు పేరు భక్తవత్సలం. ఆ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మోహన్ బాబు హీరోగా అవకాశం పొందడం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాసరి నారాయణ రావుకి సహాయ దర్శకుడిగా పని చేస్తూ స్వర్గం నరకం సినిమా ద్వారా హీరోగా వచ్చారు.
Advertisement
ఆ తర్వాత అనేక విలన్ పాత్రలు, హీరో పాత్రలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరిగా నిలిచారు మోహన్ బాబు. ఇప్పుడు ఆయన క్రేజ్ తగ్గిన సరే డేరింగ్ హీరోగా ఆయనకు మంచి పేరు ఉంది.
READ ALSO : కొత్త సినిమాలు ఎందుకు శుక్రవారం రోజునే విడుదల అవుతాయో తెలుసా..?
Advertisement
ఇక ఆయన హీరోగా అడుగు పెట్టడం వెనుక పెద్ద కథ ఉంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో… స్వర్గం నరకం సినిమాను అందరిని కొత్త వాళ్లను పెట్టే తీసుకొచ్చారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలను ఎంపిక చేశారు. ఒకరు ఈశ్వరరావు కాగా, మరొకరు భక్తవత్సలం… అంటే మోహన్ బాబు. మోహన్ బాబు అప్పటికే దాసరి వద్ద సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. దీనితో మోహన్ బాబుని హీరోగా ఎంపిక చేశారు. అయితే నిర్మాత శ్రీహరి రావుకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది.
తాము పంపిన బోసు బాబుని హీరోగా తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటికే మోహన్ బాబుని ఎంపిక చేయడం కూడా జరిగింది. దీనితో ఏం చేయాలో అర్థం కాని దాసరికి ఆయన వద్ద ఉన్న సహాయ దర్శకుడు రవి రాజా పినిశెట్టి ఒక సలహా ఇచ్చారు. విజయవాడలో ఒక సన్నివేశం షూట్ చేద్దామని, ఆ సన్నివేశంలో ఎవరు బాగా నటిస్తే వాళ్ళను తీసుకుందాం అని చెప్పారట. దీంతో ఇద్దరు మీద షూట్ చేసి ఆ సీన్ ని మద్రాస్ పంపి ఎడిట్ చేసి విజయవాడలో ప్రదర్శిస్తే భక్తవత్సలం బాగా నటించారట. దీనితో ఆయన్ను స్వర్గం నరకం సినిమాలో హీరోగా తీసుకున్నారు.
READ ALSO : రాజమౌళి, అయన భార్య రామా రాజమౌళి ఎందుకు పిల్లల్ని వద్దని అనుకున్నారంటే ?