Advertisement
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా.. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టికల్ థ్రిల్లర్ “విరూపాక్ష”. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. భోగవల్లి ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. భోగవల్లి బాపినీడు ఈ సినిమాని సమర్పించారు. కాగా కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇక మొదటి రోజు నుండే తమ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.
Advertisement
Read also: ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన 10 సినిమాలు.!
Advertisement
అయితే ఈ చిత్రానికి థియేటర్ లో వస్తున్న రెస్పాన్స్ చూసేందుకు నిర్మాత ప్రసాద్, దర్శకుడు కార్తీక్ హైదరాబాద్ లోని పలు థియేటర్లను సందర్శించారు. అయితే థియేటర్లలో రెస్పాన్స్ చూద్దామని సరదా పడి వెళ్లిన నిర్మాత, దర్శకుడికి షాక్ తగిలింది. ఈ ప్రయాణంలో దర్శకుడు కార్తీక్ దండు ఫోన్ చోరీకి గురైందట. అలాగే నిర్మాత ప్రసాద్ పర్స్ కూడా కొట్టేశారని తెలుస్తోంది. అయితే ఈ రెండు ఎక్కడ మిస్ అయ్యాయో తెలియకపోవడంతో పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లకూడదని దర్శకనిర్మాతలు భావించినట్లు సమాచారం. అభిమానుల ముసుగులో ఉన్న కొంతమంది దొంగలు ఈ చర్యలకు పాల్పడి ఉంటారని అంటున్నారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విరూపాక్ష సక్సెస్ విషయానికి వస్తే.. విడుదలైన మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ. 37 కోట్ల మేర గ్రాస్ వసూల్ అయింది. విరూపాక్ష షేర్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూలు అయిన షేర్ సుమారు 21 కోట్లు. అన్ని సినిమాల మాదిరిగా విరూపాక్షకు అత్యధిక షేర్ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. ఇక ఉత్తర అమెరికాలో దసరా సినిమా కంటే కూడా విరూపాక్షకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండటం విశేషం.
Read also: వంటింట్లో పాత్రలు కడిగే స్పాంజ్ తో కడుగుతున్నారా ?అయితే ఇది ఎంత ప్రమాదమో తెలుసుకోండి !