Advertisement
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆకల నెరవేర్చుకోవాలి అని జీవితం కష్టపడుతుంటారు. ఆ క్రమంలో చాలా వరకు తమ కోరికలను కూడా పక్కన పెట్టి డబ్బు దాచుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇల్లు, స్థలాల రేట్లు ఎంతగా పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. అది హైదరాబాదు లాంటి మహానగరాల్లో సొంతిల్లు కొనుక్కోవడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్దె కట్టే డబ్బులతో సొంత ఇల్లు ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
READ ALSO : ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు
హైదరాబాదులో వన్ బిహెచ్కె ఫ్లాట్ లేదా రీ మోడలింగ్ చేసిన ఫ్లాట్ 25 లక్షలు నుంచి 30 లక్షలకు దొరుకుతున్నాయి. సికింద్రాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 30 లక్షలు లోపు ఉంటుంది. మణికొండ, టోలిచౌకి, చందానగర్ వంటి ప్రాంతాల్లో 20 లక్షల లోపే ఇది దొరుకుతున్నాయి. మీకు నెలకు ఒక 20,000 జీతం వస్తుందనుకుందాం. అందులో రూమ్ ఇంటి అద్దె 10,000 కడుతున్నారు అనుకుంటే, మిగతా డబ్బులు మెయింటనెన్స్ కి, ఇతర ఖర్చులకు వాడుతున్నారు అనుకుందాం. ఎస్బిఐ బ్యాంకులో లోన్ అప్లై చేస్తే మీకు నూటికి 70 పైసలు వడ్డీ పడుతుంది.
Advertisement
అంటే లక్షకు రూ. 700 వడ్డీ అవుతుంది. 20 ఏళ్లకు లోన్ పీరియడ్ పెట్టుకుంటే కనుక వడ్డీ అనేది 6.4% పడుతుంది. అప్పుడు మీకు నెలకు ఈఎంఐ రూ. 12, 944 అవుతుంది. అంటే మీరు 20 ఏళ్లలో 31,6,560 రూపాయలు బ్యాంకుకి చెల్లిస్తున్నట్టు. ఇలా చేయడం వల్ల అసలు, వడ్డీ రెండు తీరిపోతున్నాయి. దీన్నిబట్టి మీకు ఏమర్థమైంది. అద్దె ఇంటికంటే సొంత ఇల్లు ఉత్తమమని…! సొంత ఇల్లు కావాలనుకుంటే ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులో అతి తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తున్నాయి. మీకు ఎస్బిఐ బ్యాంకు లోన్ కావాలంటే కనీసం 18 నుంచి 70 ఏళ్ళు వయసు ఉండాలి.
READ ALSO : రైల్వే స్టేషన్ బోర్డు లో ఊరి పేరు కాకుండా రోడ్డు అని ఎందుకు ఉంటుందో తెలుసా ?