Advertisement
Mothers Day 2023: Wishes, Quotes, Images, Messages, Greetings, Whatsapp Status Telugu మదర్స్ డే శుభాకాంక్షలు : దేవుడు ప్రతిచోటా ఉండలేకనే అమ్మను సృష్టించాడేమో అని పెద్దలు చెబుతుంటారు. అది అక్షరాలా నిజమే కదా. ప్రాణాలను పనంగా పెట్టి అమ్మ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తరవాత వారిని కంటికి రెప్పలా కాపాడుతుంది. తాను ఆకలితో ఉన్నప్పటికీ తన పిల్లలను ఎప్పుడూ ఆకలితో ఉంచకూడదని అనుకుటుంది. తాను తినకపోయినా అమ్మ తన పిల్లల కడపు నింపాలని అనుకుంటుంది.
Advertisement
తండ్రికి ఉద్యోగంలో సెలవు దొరుకుందేమో కానీ అమ్మకు ఆదివారం కూడా సెలవు ఉండదు. ప్రతిరోజూ ఇంట్లో పనులన్నీ తన భుజాలపై వేసుకుని చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే తల్లి గురించి పేజీలు నిండినా అమ్మ గొప్పతనాన్ని మాత్రం పూర్తిగా చెప్పలేం. ఇక ప్రపంచంలో ఎన్నో మంచి రోజులు ఉన్నట్టే అమ్మను గుర్తు తెచ్చుకునే రోజు కూడా ఒకటి ఉంది. అదే మదర్స్ డే.…ఈ రోజును ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి తల్లిని ఒక్కరోజే గుర్తు చేసుకోవాలా ఇలా ప్రశ్నించేవారు కూడా ఉంటారు.
అయితే ప్రతిరోజూ తల్లిని ప్రేమగానే చూసుకుంటారు కానీ మదర్స్ డే రోజున ఆ రోజంతా తల్లితోనే గడుపుతూ ఆమెకు శుభాంక్షాలు చెబితే ఆ కిక్కే వేరు. ఇక తల్లి దగ్గరగా ఉంటే ఆమెకు ఒక హగ్ ఇచ్చి మదర్స్ డే విషెస్ చెప్పాలి. ఒకవేళ దూరంగా ఉంటే మెసేజ్ రూపంలో అయినా మదర్స్ డే విషెస్ చెప్పాలి. మీకు ఏమని విషెస్ చెప్పాలి…ఎలా చెప్పాలి అనే డౌట్ ఉందా. అయితే ఈ కింద ఉన్న Mothers Day Wishes in Telugu ను మీ అమ్మకు పంపి మీలోని ప్రేమను వారికి తెలపండి.
Mothers Day 2023 Wishes Telugu
- అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా.. – హ్యపీ మదర్స్ డే
- ‘‘పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా’’ – హ్యాపీ మదర్స్ డే.
- అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. కానీ, చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ.. – మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- కనిపించని దేవుడైనా.. కనిపెంచిన నీ తర్వాతే అమ్మా!! – ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు
- ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా.. నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే – హ్యాపీ మదర్స్ డే
- అమృతం లాంటి ప్రేమను చూపేది.. అప్యాయత అనురాగం పంచేది అమ్మ – ‘హ్యాపీ మదర్స్ డే’ అమ్మ
- సృష్టిలో అందమైనది పువ్వు.. నా దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు. – హ్యాపీ మదర్స్ డే
- అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే.. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.
- అమ్మ.. నాకు మాటలు నేర్పమంటే తను కూడా నాలానే మాట్లాడుతుంది. అమ్మ.. నేను పలికే కొత్త కొత్త మాటలకి అర్థాలు చెప్పే నిఘంటువు. అమ్మ.. చందమామ రాదు అని తెలిసినా.. చందమామ రావే.. అని నా కోసం పిలుస్తుంది. అమ్మ.. నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు. – మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
Advertisement
Happy Mothers Day 2023 Wishes, Kavithalu Quotations in Telugu
- అమ్మను పూజించు భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. అందరిలో ‘అమ్మ’ను చూడు సోదరా.. మహిళలను గౌరవించరా! మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- ‘అమ్మ’లేకపోతే జననం లేదు ‘అమ్మ’ లేకపోతే గమనం లేదు ‘అమ్మ’ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు ‘అమ్మ’ లేకపోతే అసలు సృష్టే లేదు. అందుకే ‘అమ్మ’ను గౌరవిద్దాం. కంటికి రెప్పలా కాపాడుకుందాం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- ‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ అంటే.. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. ‘అమ్మ’ను గౌరవించేవాడు.. ప్రతి మహిళతో గౌరవంగా నడుచుకుంటాడు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- అమ్మ అనే రెండక్షాలు..బతుకును దిద్దే మేలిమి బంగారాలు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.. నీ చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ..! మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
- ఎప్పుడూ మన గురించి ఆలోచించే అమ్మ ప్రేమకు వేల వేల వందనాలు.మాతృదినోత్సవ శుభాకాంక్షలు !
- నాకు దేవుడు మరు జన్మను ఇస్తే నీకు తల్లిగా పుట్టాలనుంది అమ్మా .! మాతృదినోత్సవ శుభాకాంక్షలు !
- ‘ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. మారని మాధుర్యం, వెలకట్టలేని సంపద అమ్మ ప్రేమ’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- ‘ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నీకు ప్రేమను పెంచే వ్యక్తి అమ్మ మాత్రమేనని తెలుసుకో’. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- మన రేపటి బంగారు భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు అమ్మ.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు
- ’సృష్టిలో మనకు తొలి గురువు అమ్మే. తల్లిని మించిన దైవం లేదు. ఆమె త్యాగాలకు అంతులేదు. అందుకే అమ్మకు శతకోటి వందనాలు’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- మనం చేసే ప్రతి పనిలోనే మంచిని వేతికే సహనశీలి, త్యాగమూర్తి మాతృమూర్తి ఒక్కరే’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- బిడ్డకు వెలుగు పంచేందుకు తన జీవితాన్ని కొవ్వొత్తిలా ధార పోసే త్యాగశీలికి నిదర్శనం అమ్మ’… మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్లు ఎవ్వరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- నీ కంటూ వేరే ప్రపంచం ఉండొచ్చు.. కానీ అమ్మకు నీవే ప్రపంచం అని గుర్తుంచుకో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
Mothers Day Images in Telugu