Advertisement
టాలీవుడ్ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి సినీ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఆయన ఒక నిర్మాత మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ప్రస్తుతం అగ్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి సురేష్ బాబు, హీరో విక్టరీ వెంకటేష్ కు తండ్రి. సురేష్ ప్రొడక్షన్ అధినేత కూడా. అయితే, ఆయన చివరి కోరిక తీర్చలేదని విక్టరీ వెంకటేష్ నేటికీ తలచుకుంటూ బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
Read also: సరిగ్గా 100 ఏళ్ల క్రిందట అల్లూరి పై బ్రిటిషర్లు ఇచ్చిన ఈ ప్రకటన చూసారా ? వాళ్ళని ఇలా బయపెట్టాడా ?
సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ తర్వాత అక్కినేని ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీలు చాలా పెద్దవి అనే చెప్పవచ్చు. దగ్గుబాటి కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఉన్నట్టుండి చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ హీరో మరెవరో కాదు దగ్గుబాటి రాజా…. ఒకప్పుడు సౌత్ చిత్రపరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా తమిళ, మలయాళ సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజాకి దగ్గుబాటి కుటుంబానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..!
Advertisement
మూవీ మొగల్ రామానాయుడు అన్న కొడుకే ఈ దగ్గుబాటి రాజా… దర్శకుడు భారతి రాజా దగ్గర నటనలో శిక్షణ తీసుకొని హీరోగా పరిచయమయ్యాడు. తెలుగులో కూడా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం వంటి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో చెన్నై వెళ్లి తన తండ్రి నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారాలు చూసుకుంటూ సినిమాలకు దూరమయ్యాడు. అయితే రాజాకు ఉన్న మొహమాటం వల్లే ఆయన ఇండస్ ట్ రీకి దూరం కావాల్సి వచ్చింది అని అంటారు. ప్రస్తుతం వ్యాపారంలో రాణిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు రాజా.
Read also: స్టార్ హీరోల కొంప ముంచిన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ తో చాటింగ్ లో నిజాలు వెలుగులోకి..!