Advertisement
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాయి. ఆడపిల్లలు అడుగు బయట పెట్టింది మొదలు తిరిగి ఇంటికి వచ్చేవరకు భయం భయంగానే ఉంటున్నారు. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది. తాజాగా బెంగుళూరు నగరంలో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టించింది. 31 ఏళ్ల యువతి కదులుతున్న ర్యాపిడో బైక్ నుంచి దూకింది. అసలు ఏం జరిగింది..? ఆమె కదులుతున్న బైక్ పై నుండి దూకడానికి గల కారణం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ ప్రైవేట్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంది. ఈనెల 21న రాత్రి 11:30 గంటల సమయంలో ఇందిరానగర్ లోని తన నివాసానికి వెళ్లేందుకు ర్యాపిడో యాప్ లో బైక్ ని బుక్ చేసుకుంది.
Advertisement
Read also: దగ్గుబాటి ఫ్యామిలీలో ఈ హీరో ని గుర్తు పట్టారా ? అతను ఎవరంటే ?
అనంతరం యువతని పికప్ చేసుకునేందుకు బైకర్ వచ్చాడు. బైక్ రాగానే ఆమె ఎక్కి కూర్చుంది. వచ్చి రాగానే ఓటిపి కోసమని చెప్పి ఆమె మొబైల్ లాక్కొని, కౌగిలించుకొని వెకిలి చేష్టలు చేశాడు. ఇక బైక్ కదులుతున్న సమయంలో ఆమెను ఎక్కడపడితే అక్కడ తడమడం, అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమె ఎంచుకున్న ప్రాంతానికి కాకుండా దొడ్డబల్లాపూర్ వైపు బైక్ ని మళ్లించాడు. దీన్ని గమనించిన యువతి అతనిని ప్రశ్నించింది. బైక్ ఆపాలని కోరింది. అయినా అతడు వినకుండా బైక్ స్పీడ్ పెంచాడు.
Advertisement
దీంతో కీడు శంకించిన మహిళ అతనికి చేతిలో ఉన్న తన ఫోన్ ని లాక్కొని రన్నింగ్ బైక్ పై నుండి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తరువాత ఆమె సహాయం కోసం తన స్నేహితుడికి ఫోన్ చేసింది. అనంతరం అతనితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రైడర్ ని వెతికి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కిడ్నాప్, వేధింపులు, లైంగిక దాడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తరువాత మహిళలు, పౌరుల భద్రతపై పోలీసులు ఫోకస్ పెంచారు.