Advertisement
మాలీవుడ్ బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో తన అందచెందాలతో అభిమానుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. 2005లో బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్. కానీ ఈ అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు. ఇక 2008లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శివాజీ హీరోగా నటించిన ఆలయం చిత్రంలో మొదటిసారి హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన “ఈ వర్షం సాక్షిగా” అనే సినిమాలో కూడా ఈమె ఓ ప్రధాన పాత్ర పోషించింది.
Advertisement
Advertisement
కానీ ఇన్నాళ్లకు ఈ ముద్దుగుమ్మకు టైం వచ్చింది. బాలయ్య సినిమాతో ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలోనూ ఫోటోలు, వీడియోలతో రచ్చ లేపుతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఈమెకు వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈమె వయసుకు 33 ఏళ్లు. కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇందుకు గల కారణం కెరీర్ లో సెటిల్ కాలేదు అన్న ఒకే ఒక రీజన్ తో చేసుకోవడం లేదట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హనీ రోజ్.. తన పెళ్లి విషయంపై స్పందించింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని తన అభిప్రాయాన్ని తెలిపింది.
ఆ బాధ్యతకు తన సిద్ధంగానే ఉన్నానని.. వివాహ బంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది. ఇక మరోవైపు బాలకృష్ణ ఆయన రానున్న సినిమాలలో కూడా హనీ రోజ్ కి అవకాశం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం ఇచ్చినట్లు ప్రస్తుతం ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. మరి ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
Read also: ఆ హీరో కూతురుతో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్నారా?