Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్.. సౌత్ లో రజనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోను ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. ఏడుపదుల వయసులో కూడా యూత్ మొదలు అన్ని వయసుల వారు ఆయనను అభిమానిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనని చూసేందుకు జనం క్యూ కడతారు. ఇతర రాష్ట్రల నేతలు సైతం రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తారు. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు నందమూరి బాలకృష్ణ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రజినీకాంత్. దీంతో అధికార వైసీపీ నుండి ఆయనపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ.. బాలకృష్ణ, చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.
Advertisement
Read also: ఏజెంట్ సినిమా పై వస్తున్న ట్రోల్ల్స్ కి అక్కినేని అమల కిరాక్ రిప్లై ! ఏమని ట్వీట్ చేసారంటే ?
వేదికపై చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాజకీయాల గురించి తప్పకుండా ప్రస్తావించాలని అన్నారు రజినీకాంత్. నేడు లక్షల మంది తెలుగు ప్రజలు ఐటీ లో పనిచేస్తూ లగ్జరీగా బతుకుతున్నారంటే అందుకు చంద్రబాబు నాయుడు కారణమని అన్నారు. వారి స్నేహం ఇప్పటిది కాదని కాదని.. గత 30 ఏళ్ల క్రితమే మోహన్ బాబు తనకి చంద్రబాబు నాయుడుని పరిచయం చేయించారని చెప్పారు. విజన్ 2020 గురించి చంద్రబాబు 1996, 1997 సమయంలోనే తనతో చెప్పారని.. ఆ సమయంలోనే చంద్రబాబు ఐటీ ప్రాధాన్యతను గుర్తించారని అన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ ను హైటెక్ సిటీగా మార్చారని అన్నారు. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేసేందుకు దేవుడు చంద్రబాబుకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. దీంతో జగన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆయనపై దారుణమైన ట్రోల్స్, సెటైర్స్, మీమ్స్ తో విరుచుకుపడ్డారు.
Advertisement
రజనీకాంత్ కేవలం చంద్రబాబుకు లబ్ధిచేకూర్చేందుకే వచ్చారని కామెంట్స్ చేశారు. రజినీకాంత్ కి ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రజినీకాంత్ కి కేవలం చంద్రబాబు చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని.. ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడడమే ఆయన చేసిన పాపమైనట్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా ఆయనని పర్సనల్ గా కూడా విమర్శిస్తున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. హైదరాబాద్ అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి మాత్రం మరువలేనిది. అది ఎవరూ కాదనలేనిది. ఏది ఏమైనా.. ఎవరు మన రాష్ట్రానికి వచ్చినా కూడా వారిని గౌరవించడం మన సంప్రదాయం. దానిని మరిచి యూత్ ఏంటని రజిని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రజనీకాంత్ వ్యక్తిత్వం తెలిసికూడా ఆయనపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని అభిప్రాయపడుతున్నారు.
Read also: ఆరుగురు పతివ్రతలు సినిమాలో నటించిన ఈ బ్యూటీ…ఇప్పుడేం చేస్తుందో తెలుసా…