Advertisement
భార్య గర్భవతి అని తెలిసినప్పుడు భర్త ఎంతగానో సంతోషిస్తాడు. భార్యే కాదు అతని తరపు వారు, ఆమె తరపు వారు కూడా చాలా సంతోషపడతారు. ఆమెకు తగిన విశ్రాంతి, ప్రశాంతత కలిగి ఉండే వాతావరణన్ని కల్పిస్తారు. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి అంశానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారమే పూర్వకాలం నుంచి మన పెద్దలు నడుచుకుంటూ వస్తున్నారు. వాటిని ఇప్పటికీ పాటిస్తున్నారు. అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని కొన్ని ఆచారాలు కూడా మన హిందూ సంప్రదాయంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: అమ్మాయిలు.. ర్యాపిడో బైక్ పై వెళుతున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే..!!
* భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చెట్టు నరకడం మరియు సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు.
* భార్యకు ఆరు నెలల నుంచి డెలివరీ వరకు భర్త కటింగ్, షేవింగ్ చేసుకోకూడదంట. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు అరిష్టం జరుగుతుందంట.
* అలాగే మరణించిన వారి పాడే పొరపాటున కూడా ముట్టుకోకూడదట. చనిపోయిన వారి ఇంటికి అసలే వెళ్లకూడదట.
Advertisement
* గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త యొక్క ముఖ్య ధర్మం. అలా చేయడంవల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడు. అలాగే భార్య కోరికలు తీర్చకపోతే దోషము కూడా కలుగుతుందట.
* ఇక భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త విదేశీ ప్రయాణాలకు వెళ్లకూడదట. అలాగే ఆమెని విడిచి దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, పర్వతారోహణ, పడవలు ఎక్కకూడదట.
* ఇక భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహప్రవేశం వంటివి చేయకూడదట.
* అలాగే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొబ్బరికాయ కొట్టడం, అభిషేకం చేయడం చేయకూడదంట. గుడికి అసలే వెళ్లకూడదట.
* అలాగే ప్రేత కర్మలు చేయకూడదట. ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు చేయకపోవడం మంచిదట.
* ఈ విధంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఇలాంటి కొన్ని పనులకు దూరంగా ఉండటం వల్ల భార్య సంతోషంగా ఉండి పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు.
Read also: ఏజెంట్ సినిమా పై వస్తున్న ట్రోల్ల్స్ కి అక్కినేని అమల కిరాక్ రిప్లై ! ఏమని ట్వీట్ చేసారంటే ?