Advertisement
ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న చైతన్య మాస్టర్ ఆదివారం నెల్లూరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు ఆయన తాను చేసిన అప్పుల బాధ భరించలేక ఆత్మ**త్య చేసుకుంటున్నట్టు వీడియో విడుదల చేశాడు. ఇప్పుడు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Advertisement
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?
ఆయన స్నేహితులు ఇండస్ట్రీలో ఆయనతో పని చేసిన వారు, పరిచయం ఉన్నవారు ఈ విషయం తెలిసి ఎంతో బాధపడుతున్నారు. ఇలా చైతన్య మరణించడంతో పలువురు ఈయన మరణానికి గల కారణాలను, ఆయన ఎందుకు అప్పులు చేశారో అనే విషయాల గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు. డిసెంబర్ 31 రోజున ఈయన ఒక ఈవెంట్ ప్లాన్ చేశారని, అయితే ఈవెంట్ కోసం ఆర్టిస్టులను పిలిచారు. చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వటం వల్లే ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు తనకు డబ్బు ఇవ్వలేదని తెలిపారు. సుమారు వారి నుంచి ఏడు లక్షల వరకు డబ్బు రావాల్సి ఉండగా, వారు ఇవ్వకపోవడంతో మిగిలిన ఆర్టిస్టులకు డబ్బు ఇవ్వడానికి అప్పులు చేశారని తెలుస్తుంది.
Advertisement
ఇలా ఇంత మొత్తంలో డబ్బులు అప్పు చేసి ఆర్టిస్టులకు ఇచ్చారు. ఈ అప్పును తీర్చడం కోసం మరొకచోట అప్పు తీసుకువచ్చి అప్పు తీర్చే ప్రయత్నాలు చేశారు. ఇలా భారీగా వడ్డీలు పెరిగిపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకురావడం వల్లే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చైతన్య మాస్టర్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా క్షణికావేశంలో ఈయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైంది కాదని పలువురు ఈయన మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?