Advertisement
వయస్సు వచ్చిన ఎవరైనా సరే…. పెళ్లి గురించి ఆలోచించాలి అనేది పాత మాట. అప్పట్లో అయితే ఆ ఏజ్ కి పెళ్లి వయసు వచ్చేసిందని లేట్ అయితే ముదురు బెండకాయ అంటారని కంగారు పడే వాళ్ళు. అయితే ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 30 ఏళ్లకు పెళ్లి చేసుకున్న చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నట్టే లెక్క. చదువు, ఉద్యోగాల పేర్లు చెప్పి అప్పటివరకు చాలామంది లాగించేస్తున్నారు అనుకోండి. అయితే పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా…? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
READ ALSO : నేటి తరానికి అస్సలు పరిచయం లేని ఈ తెలుగు సినీ స్టార్స్ గురించి తెలుసా ?
ప్రతి మనిషి మూడు రుణాలతో పుడతాడు. 1. రుషి రుణం. 2. దేవ రుణం. 3. పితృ రుణం. ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ రుణాలను తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తుంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు రుణ విముక్తుడు కావాలి. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానం కనడం ఇవి మానవుడు తప్పనిసరిగా చేయవలసిన విధులుగా వేదం చెబుతున్నది. ముఖ్యంగా పితృరుణం గురించి తెలుసుకోవాలి.
Advertisement
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించిన వారు సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా పితృదేవతలకు తర్పణాధిక్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృరుణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి కదా. ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః అంటుంది వేదం. అంటే వంశ పరంపరను తెంచవద్దు. ఇలా ఈ మూడు కారణాల కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సి ఉంటుంది.
READ ALSO : Nani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?