Advertisement
Allari Naresh Ugram Movie Review in Telugu: అల్లరి నరేష్ “ఉగ్రం” రివ్యూ: తెలుగు సినీ ప్రేక్షకులకు అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తరువాత మాత్రం వాటి పైనే ఆధారపడలేదు. నేను, విశాఖ ఎక్స్ప్రెస్, శంభో శివ శంభో, గమ్యం, మహర్షి వంటి చిత్రాలలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఆ తర్వాత నాంది అనే చిత్రంతో తన రూట్ మార్చేశాడు అల్లరి నరేష్.
Advertisement
కామెడీ కథలకు స్వస్తిపలికి సీరియస్ కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అల్లరి నరేష్, విజయ్ కనకమెడల దర్శకత్వంలో మరో మూవీ తెరకెక్కింది. ఉగ్రం పేరుతో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు.
Read also: సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసాహారం తినకూడదా ? అసలు మంచిది కాదా….?
ఈ మూవీలో అల్లరి నరేష్ కి జోడిగా మలయాళ ముద్దుగుమ్మ మీర్జా మీనన్ నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చారు. అలాగే తూమ్ వెంకట్ కథ అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. వేసవి కానుకగా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం..
కథ మరియు వివరణ:
Advertisement
ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు అల్లరి నరేష్. సీఐ శివకుమార్ వరంగల్ సిటీలో ఎన్నో చిక్కుముడులు ఉన్న కేసులను ఇట్టే పరిష్కరిస్తూ ఉంటాడు. అలా సాగిపోతున్న శివకుమార్ జీవితంలోకి అపర్ణ ( మిర్నా మీనన్) వస్తుంది. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు శివకుమార్. తన తండ్రిని ఎదిరించి మరీ శివని పెళ్లి చేసుకుంటుంది అపర్ణ. ఆ తర్వాత వీరికి ఓ పాప పుడుతుంది. అలా వీరి జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో సిఐ శివకుమార్ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది.
ఈ ప్రమాదంలో శివకుమార్ గతాన్ని మర్చిపోతాడు. అప్పుడే శివకుమార్ భార్య, బిడ్డ కనిపించకుండా పోతారు. వీరే కాదు సిటీలో ఎంతోమంది అలా కనిపించకుండా పోతారు. ఇలా కనిపించకుండా పోవడానికి సిటీలోని హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠానే కారణం. వాళ్లందరినీ వెతికి తిరిగి తీసుకువచ్చే క్రమంలో శివకుమార్ కి ఎదురైన సవాళ్లు ఏంటి..? ఆ ముఠా ఆగడాలకు సిఐ శివకుమార్ ఎలా చెక్ పెట్టాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంతో తన పేరు ముందు ఇక అల్లరి ఉండదని చెప్పకనే చెప్పారు నరేష్. సినిమా మొత్తానికి కర్త, కర్మ, క్రియ అన్ని తానై పోషించాడు అల్లరి నరేష్. మూవీ ఫస్ట్ ఆఫ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత నుంచి ట్రాక్ ఎక్కుతుంది. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల వరకు అసలు ఏం జరుగుతుందో తెలియక థియేటర్ కి వెళ్లిన జనాలు తలబద్దలు కొట్టుకుంటారు. ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మ్యూజిక్ అనుకున్నంత మాయ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ లో మిస్టరీ, ట్విస్టులు, ప్రేక్షకులకు ఊరట కలిగిస్తాయి. కొన్ని చోట్ల సాగదియ్యడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా మూవీపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్ :
నరేష్ పర్ఫామెన్స్
ఇంటర్వెల్ సీక్వెన్స్
ట్విస్ట్ లు
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
లవ్ స్టోరీ సీక్వెన్స్
రేటింగ్: 2.5/5
Read also: తన కంటే పెద్ద వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న సచిన్ లవ్ స్టోరీ ట్విస్టులు మాములుగా లేవు !