Advertisement
The Kerala story movie Review Telugu: “ది కేరళ స్టోరీ”.. కేరళలోని కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని సుదీప్ సేన్ దర్శకత్వంలో విపుల్ షా నిర్మించిన ఈ చిత్రం భారీ నిరసనల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీలో అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజునుంచే దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. కేరళ ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సినిమాపై మండిపడ్డారు. ఆందోళనలు, నిరసనల మధ్యనే ది కేరళ స్టోరీ చిత్రం విడుదలైంది. అయితే అసలు ఈ సినిమాలో ఏముంది..? ఈ సినిమా కథ ఏంటి అనే విషయాలను రివ్యూలో చూద్దాం..
Advertisement
Read also: హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాలు ఏవంటే…?
The Kerala Story Movie Story in Telugu కథ మరియు వివరణ:
యూఎన్ డిటెన్షన్ సెంటర్ లో గాయపడిన అదా శర్మ సన్నివేశంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. విచారణ సమయంలో ఆమె శిక్షణ పొంది ఐసిస్ ఉగ్రవాదిగా ఎలా మారింది అనే విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఫాతిమా లాగా మారిన శాలినికి ఆఫ్ఘనిస్తాన్ లో ఎదురైన చేదు అనుభవాలను తన ఇద్దరు స్నేహితులు నీమా, గీతాంజలి చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్ లో కథ సాగుతోంది. కేరళలోని కాసర్గాడ్ లోని నార్సింగ్ కాలేజీలో శాలిని ఉన్నికృష్ణన్ ( అదా శర్మ), నిమా ( యోగితా బిహాని), గీతాంజలి ( సిద్ది ఇద్నాని) అనే ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ హిందువు అయిన శాలిని ఉన్నికృష్ణన్ కి నిమా, గీతాంజలికి పరిచయం అవుతారు.
Advertisement
వీటితోపాటు ఐసిస్ అండర్ కవర్ గా పనిచేసే ఆసిఫా శాలినికి పరిచయం అవుతుంది. ఆసిఫా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి.. వారికి మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మారుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా అసిఫా ఇద్దరు అబ్బాయిలను రంగంలోకి దించి గీతాంజలి, శాలినితో లవ్ జిహాద్ ఉచ్చులోకి దించే ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే రమీజ్ అనే అబ్బాయి తో ప్రేమలో పడిన శాలిని గర్భవతి అవుతుంది. అయితే శాలిని ఇస్లాం మతంలోకి మారితేనే వివాహం చేసుకుంటానని చెబుతాడు రమీజ్. దీంతో వేరే దారి లేక అతడిని పెళ్లి చేసుకుని ఇస్లాంలోకి మారి సిరియా లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అఫ్గానిస్థాన్ లో అరెస్ట్ అవుతుంది శాలిని. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ది కేరళ స్టోరీ సినిమా చూడాల్సిందే.
దర్శకుడు ఈ సినిమాని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూస్తే ఒక ఎజెండా ప్రకారం రూపొందించారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాని ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుత సన్నివేశాల మధ్య బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు సుదీప్తో సేన్ చక్కగా మలిచారు. ఇక అదాశర్మ, యోగిత, సోనియా, సిద్ది చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ముఖ్యంగా శాలిని గా, ఫాతిమాగా రెండు వేరియేషన్స్ ఉన్న అమ్మాయి పాత్రలో ఆదాశర్మ అద్భుతంగా నటించింది. మొత్తంగా వాస్తవాలు, వివాదాలు ఎలా ఉన్నా.. ది కేరళ స్టోరీ చూసేందుకు బాగుంది.
The Kerala story movie review రేటింగ్: 2.5/5
Read also: రెబెల్ స్టార్ ప్రభాస్ వలెనే మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించారట !