Advertisement
ప్రేమ.. రెండు అక్షరాలే కానీ దీనిని వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిపై మొదలవుతుందో చెప్పడం కష్టం. చాలామంది ప్రేమలో పడతారు. ఆపై విడిపోతుంటారు. ఇటీవల చాలామంది ప్రేమ వివాహాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే ఒడిశాకు చెందిన ఇద్దరు కలెక్టర్లు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అప్పుడప్పుడు విధినిర్వహణలో కలుసుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత అది ఇష్టంగా మారింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
Advertisement
Read also: హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాలు ఏవంటే…?
ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. వీరిరువురికి ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం పూరి కలెక్టర్ గా సమర్థవర్మ, రాయగడ్ కలెక్టర్ గా స్వాధా దేవ్ సింగ్ పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరికీ గతంలోనే వేరువేరు వ్యక్తులతో వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ మనస్పర్ధలు తలెత్తి వారి భాగస్వాములతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి విడిగానే ఉంటున్నారు. స్వాధ దేవ్ సింగ్ కొంతకాలం కిందట కలెక్టర్ చంచల్ రానాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన బలరింగ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Advertisement
వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక పూరి కలెక్టర్ సమర్థవర్మ కొన్ని నెలల కిందట తన సహుద్యోగి సుచి సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా మనస్పర్ధలతో విడిపోయారు. తమ భాగస్వాములతో విడిపోయిన వీరు వేరువేరుగా ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వీరి రెండవ పెళ్లికి వారి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో మే 15న వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి పూరికి చెందిన కొంతమంది సేనాయత్ లను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సామాజిక వేదికలలో వైరల్ గా మారింది. అంతేకాదు వీరిద్దరూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం కూడా వ్యక్తమౌతుంది.
Read also: రెబెల్ స్టార్ ప్రభాస్ వలెనే మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించారట !