Advertisement
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు ఓ కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలను మోసం చేసేందుకు మాయగాళ్లు మరో కొత్త స్కెచ్ తో రంగంలోకి దిగారు. అదేంటంటే.. ప్రపంచంలో అత్యంత పాపులర్ మెసేజింగ్ యాప్.. “వాట్సాప్”. కోట్లాదిమంది నిత్యం ఈ యాప్ ని వినియోగిస్తుంటారు. దీంతో కొందరు సైబర్ నేరస్తులు కూడా వాట్సాప్ ద్వారా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వాట్సాప్ ద్వారా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సైబర్ నేరస్తులు. ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వాట్సాప్ యూజర్లను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Read also: బన్నీ సుకుమార్ ల ట్విస్ట్ అదిరింది !
ఈ నేపథ్యంలోనే గత పది రోజులుగా ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి భారీగా వాట్సాప్ మెసేజ్ లు, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ వస్తున్నాయి. అలాగే లోన్, లాటరీల పేరిట ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి వాట్సప్ కి మెసేజ్ లు మరియు కాల్స్ వస్తున్నట్లుగా పోలీసులకి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ కాల్స్ ఇథియోపియా, మలేషియా, వియత్నం వంటి దేశాల ఐఎస్డి కోడ్స్ తో వస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కంత్రిగాళ్ళ చేతికి తమ నెంబర్లు ఎలా చిక్కాయని వాట్సాప్ యూజర్లు నెత్తి బాదుకుంటున్నారు.
Advertisement
ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి అమ్మాయిల పేరుతో కూడా మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇది ఓ పెద్ద స్కామ్ అని.. విదేశీ కోడ్ లతో ఫోన్లు వస్తే రెస్పాండ్ కావద్దని సూచిస్తున్నారు పోలీసులు. వీటిల్లో ఏ కాల్ లిఫ్ట్ చేసినా అంతిమంగా నష్టపోవడం ఖాయమని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విదేశీ స్కామ్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. ఈ స్కామ్ కాల్స్ ని అరికట్టేందుకు త్వరలో వాట్సాప్ లో సైతం ట్రూ కాలర్ సేవలను తీసుకురానున్నట్లు ట్రూ కాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలన్ మమోది వెల్లడించారు.
వాట్సాప్ స్కామ్: ఇథియోపియా (+ 251), మలేషియా (+ 62), కెన్యా (+ 254), వియత్నాం (+ 84) సహా వివిధ దేశాల కోడ్ ల ముందు ఉండే ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి భారత్ లో వాట్సాప్ యూజర్లకు వచ్చే కాల్స్ ని లిఫ్ట్ చేయవద్దు.
Read also: NAGA CHAITANYA CUSTODY REVIEW IN TELUGU: నాగచైతన్య “కస్టడీ” సినిమా మొదటి రివ్యూ