Advertisement
జీవితం ఒక వరం. జీవితం ఎంతో అందమైనది, విలువైనది కూడా. అటువంటి జీవితాన్ని తనివితీర ఆస్వాదించాలి, అనుభవించాలి. జీవితంలో ఎన్నో వడిదుడుకులు, కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ జీవితంలో ఓ భాగమే కానీ శాశ్వతం కాదు. ఈ విషయం తెలిసి కూడా కొందరు అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో వందేళ్ళ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపివేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకు చావు పరిష్కారం కాదు.
Advertisement
READ ALSO : AKKINENI AKHIL AGENT REVIEW IN TELUGU: అక్కినేని అఖిల్ “ఏజెంట్” మొదటి రివ్యూ.. ఈసారి హిట్ కొట్టినట్టేనా..?
తాజాగా భర్త సంపాదన సరిపోవడం లేదని ఓ భార్య తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలేం జరిగిందంటే..? తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన దామోదర్, సరిత (32) కి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరు జల్లాపురం గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే పిల్లల చదువు కోసం వీరు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లేవారు. అలా వీరి సంసారం ఆర్థిక ఇబ్బందులతోనే ముందుకు సాగుతూ వచ్చింది. ఇక పిల్లలు కూడా పెరిగి పెద్దవారు అవుతున్నారు. తోటి తల్లిదండ్రుల లాగా పిల్లలని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేదు.
Advertisement
భర్త సంపాదన సరిపోవడం లేదని భార్య తరచూ బాధపడేది. ఈ క్రమంలోనే దామోదర్ జీవనోపాధి కోల్పోయాడు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మరింతగా ఎక్కువయ్యాయి. ఉపాధి కోసం దామోదర్ చాలా చోట్ల తిరిగాడు. కానీ ఎక్కడ పని దొరకలేదు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో సరిత అనారోగ్యానికి గురైంది. దీంతో ఏం చేయాలో తోచక బుధవారం తెల్లవారుజామున సరిత ఇంట్లో ఉరివే* ఆత్మహ*కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు మానవపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
READ ALSO : మల్లేశ్వరి సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా మారిపోయిందంటే ?