Advertisement
మనం ఇప్పటివరకు ఎన్నోసార్లు రైలులో ప్రయాణం చేసి ఉంటాం. లేదా కనీసం రైలుని చూసి అయినా ఉంటాం. అయితే రైలు గురించి మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. రైలు పట్టాల దగ్గర నుండి భోగి వరకు, రైలు ఇంజన్ నుండి లోపల తిరిగే ఫ్యాన్ ఇలా చాలావరకు అన్ని ఆసక్తికరమే. రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని ఆ కిటికీ లోంచి బయటకి చూస్తూ ఉంటాం. అయితే రైలులో లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, పై బెర్త్, సైడ్ లోయర్ బెర్త్ ఉంటాయి. సాధారణ సమయంలో అయితే మిడిల్ బెర్త్ లో పడుకోలేరు లేదా కూర్చోలేరు.
Advertisement
ఎందుకంటే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్ ప్రయాణికుడు తన బెర్త్ పై రాత్రి 10 గంటలకు ముందు, ఉదయం 6 గంటల తర్వాత నిద్రించకూడదు. అతను రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 6 గంటల వరకు మాత్రమే తన సీటుపై పడుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుడు పగటిపూట అలసిపోయి నిద్రపోవాలనుకున్న రాత్రి 10 గంటల వరకు రైలులో కూర్చొనే ఉండాలి. మరోవైపు రైల్వే ఈ నియమాన్ని పాటించకపోతే వారిపై రైల్వేశాఖ చర్యలు తీసుకోవచ్చు.
Advertisement
టికెట్ తనిఖీ నియమం గురించి మాట్లాడితే, TTE పగటిపూట మాత్రం మీ టిక్కెట్ ను తనిఖీ చేయగలడు. టికెట్ చెకింగ్ పేరుతో రాత్రి 10 గంటల తర్వాత ఆయన మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేడు. ఒక TTE మీ టికెట్ ను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే తనిఖీ చేయగలరు. మరోవైపు టిటిఈ ఈ నిబంధనను పాటించకపోతే అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇది పగటిపూట ప్రయాణం చేసే రూళ్లకు మాత్రమే వర్తిస్తుంది. రాత్రిపూట బయలుదేరే రైళ్లకు మాత్రం ఈ నియమం వర్తించదు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
వెంకటేష్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా… ఆమె ఆస్తులు ఎంత అంటే!
మల్లేశ్వరి సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా మారిపోయిందంటే ?