Advertisement
కొత్తగా వివాహమైన భార్య, భర్తలు కొన్ని నెలల వరకు ఒకరిపై ఒకరు విపరీతమైన కేరింగ్ తీసుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క మెప్పు పొందాలని అనుకుంటారు. ఒకరి ఇష్టా ఇష్టాలను మరొకరు పంచుకుంటూ ముందుకు వెళ్తారు. ఒకరికి, ఒకరు సమయాన్ని వెచ్చిస్తూ అనేక విషయాలను సరదాగా చర్చించుకుంటారు. అలా ఒక్కోసారి సరదాగా చర్చించుకునే విషయాలే సీరియస్ అవుతాయి. అలా ఏ సమయంలో సీరియస్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. అలాగే జీవిత భాగస్వామి ముందు ఈ 6 విషయాలు అసలు మాట్లాడకూడదట..
Advertisement
1.కుటుంబ సభ్యుల గురించి:
ఎలాంటి పరిస్థితి వచ్చిన మీ జీవిత భాగస్వామి దగ్గర వారి కుటుంబ సభ్యులు తక్కువ చేసి మాట్లాడడం, వారి గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం అస్సలు చేయరాదట. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయని అంటున్నారు.
2. పాత స్నేహితులు:
వివాహం తర్వాత మీకు గతంలో ఉండేటువంటి స్నేహాలు ఇతర పరిచయాల గురించి మీ జీవిత భాగస్వామితో అస్సలు మాట్లాడరాదట. అలా మాట్లాడడం వల్ల ఒక్కోసారి అవి మీ క్యారెక్టర్ ను బ్యాడ్ చేయగలవు.
Advertisement
3. ఇతరులతో పోలిక:
మీ భార్యను లేదా భర్తను ఇతరులతో అసలు పోల్చరాదు. దీనివల్ల వారిలో అసూయ, ఈర్ష, కోపం పెరుగుతాయి.
4.చెడు అలవాట్లు
మీకు గతంలో డ్రింకింగ్, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. అలా కాకుండా వాటి గురించి మీ భాగస్వామితో అసలు చర్చించవద్దు.
5. పాత గొడవలు:
భార్యాభర్తలు అన్నాక సంసారంలో అనేక గొడవలు వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడే వదిలేయాలి కానీ తవ్వుకుంటూ దాన్ని పెద్దది చేసుకోకూడదని అంటున్నారు.
6. లోపాలు:
ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి లోని లోపాలను ఎత్తి చూపడం అస్సలు మంచిది కాదు. ఈ విధంగా భార్యాభర్తలు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా పై విషయాలన్నీ పాటిస్తే హ్యాపీగా జీవిస్తారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!
- Sr. NTR, Jr. NTR పెళ్లి పత్రికల్లో ఇవి గమనించారా…!
- సునిసిత్ ని చితక బాదిన రామ్ చరణ్ ఫాన్స్ !