Advertisement
మనం థియేటర్ కు వెళ్ళినప్పుడు సినిమా మొదలు కావడానికి ముందు ముఖేష్ యాడ్ వస్తుంది. సిగరెట్ కు సంబంధించి ఒక యాడ్ వస్తుంది. ఒక మహిళ రెండు గాజులు అమ్ముకున్నారని మరో యాడ్ వస్తుంది. ఇవన్నీ మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ యాడ్స్ పై బయట అనేక ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఆ యాడ్స్ చూసి మనమైనా అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వాళ్లు అవేర్నెస్ కల్పించడం కోసం ముందుగా ఈ యాడ్స్ ఇస్తారు. మరి ఈ యాడ్స్ లో చేసిన వారు నటులా లేదంటే బాధితులా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
ఇందులో ముఖేష్ యాడ్ చూసి చాలామంది ట్రోల్ చేశారు. ముఖేష్ రియల్ గానే పొగాకు వల్ల ఇబ్బందులు పడ్డారట. మహారాష్ట్రకు చెందిన ముఖేష్ రోజువారి కూలి. తన సంపాదన మీద కుటుంబం ఆధారపడేది. గుట్కా వ్యసనం తన జీవితాన్ని మార్చింది. ఒక ఏడాది పాటు గుట్కా తిన్నాడు. తన ఆరోగ్యం పాడయింది. అయినా వినకుండా గుట్కా తింటూనే ఉన్నాడు. నోటి క్యాన్సర్ వచ్చింది. చివరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే ముఖేష్ ఆసుపత్రిలో ఉన్న టైంలో భారత ప్రభుత్వం అక్కడికి వెళ్లి ఈ యాడ్ షూట్ చేసిందట. ముఖేష్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా కానీ గుట్కా వల్ల తాను పడ్డ సమస్యని తెలియజేశాడు.
Advertisement
27 అక్టోబర్ 2009లో ముకేశ్ కన్నుమూశారు. ఇదే కాకుండా మరో అడ్వర్టైజ్మెంట్ లో సునీత అనే ఆవిడ కనబడతారు. ఆమె 30 ఏళ్లు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పొగాకు తినడం వల్ల క్యాన్సర్ బారిన పడింది. 2013లో ట్రీట్మెంట్ తీసుకుంది. తగ్గిందని అనుకున్న క్యాన్సర్ 2015లో వచ్చి ఆవిడ చనిపోయింది. ఆమె చనిపోవడానికి ముందు మోడీకి ఉత్తరం రాసింది. పొగాకు వలన నా జీవితం అలా అయిపోతుందని ఊహించలేదంటూ లేఖలో పేర్కొంది. ఈ విధంగా ఈ యాడ్స్ లో నటించిన వారంతా పొగాకు, సిగరెట్ వల్ల క్యాన్సర్ బారిన పడిన బాధితులే.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు: