Advertisement
ఒకప్పుడు మాస్కులు అంటే ఎవరికీ తెలిసేవి కావు. వాటిని కేవలం డాక్టర్లు లేదంటే, ఇతరాత్ర ల్యాబ్ లో పని చేసేవారు వాడుతుంటే చూసేవాళ్ళం. కరోణ మహమ్మారి పుణ్యమా అని చిన్నపిల్లల నుంచి ముసలి తల్లుల వరకు మాస్క్ అంటే ఏంటో తెలిసి పోయింది.. కానీ మాస్కూల్లో రకరకాలు ఉన్నాయి.. వాటిలో కొన్ని మాస్కూలపై గుండ్రని క్యాప్ ఉంటుంది . మరి ఆ క్యాప్ దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం..?
Advertisement
మాస్క్ పై ఉండే క్యాప్ మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు క్లోజ్ అయి ఉంటుంది. దీనివల్ల ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ లు, మన లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. కానీ మనం ఊపిరి వదిలినప్పుడు ఇది ఓపెన్ అయి మన వేడి గాలిని బయటకు పంపుతుంది. ఒకప్పుడు ఫ్యాక్టరీలో వాడిన ఈ రెస్పిరేటరీ మాస్క్ లకు వన్ వే వాల్ ఉండేది కాదు. దీనివల్ల కోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీలో పని చేసే వారికీ దుమ్ము ఫిల్టర్ అయిపోయి ఫ్రెష్ ఎయిర్ ని పీల్చుకున్న కానీ, వారి నోటి నుంచి విడుదలయ్యే వేడిగాలి, ఆవిరి లోపల ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడేవారు.
Advertisement
దీని తర్వాత వీటికి వన్ వే వాల్స్ పెట్టడంతో చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ గంటలతరబడి పనిచేస్తున్నారు. అందుకే ఈ మాస్క్ లకు ఆ గుండ్రని క్యాపులను అమరుస్తారు. అలా గుండ్రని క్యాపు ఉన్న మాస్క్ ల ధర కామన్ మాస్కుల కంటే ఎక్కువగా ఉంటుంది. వీటినే ఎన్ 95 మాస్క్ లు అని పిలుస్తారు.
also read: