Advertisement
స్నేహం ఎప్పుడు ఎవ్వరినీ ఎలా చేస్తుందో అస్సలు ఊహించలేము. కొంత మంది కలిసి మెలిసి ఉంటారు. మరికొందరూ కొద్ది కాలం పాటు స్నేహంగా స్నేహితులను మోసం చేస్తారు. ఇలా మోసం చేసిన పరువా లేదు. మరికొందరూ మాత్రం నమ్మిన స్నేహితుడు లేదా స్నేహితురాలు అని చూడకుండా నిండు నూరేళ్లు బతకాల్సిన వారిని తిరిగిరాని లోకాలను పంపుతారు. తాజాగా చోటు చేసుకున్న ఘటన అలాంటి కోవకు చెందిందనే చెప్పవచ్చు.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. ఎల్.కోట మండలం కళ్లెపల్లి గ్రామానికి చెందిన గోకెడ మహేశ్వరి, గాడి చిన్న తల్లిలు మంచి స్నేహితులు. వీరు గ్రామంలో వైఎస్సార్ క్రాంతి పథకంలో బుక్ కీపర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అలా వీరి స్నేహం కొద్ది రోజుల వరకు బాగానే నడిచింది. వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా కొద్ది రోజులుగా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్వరి, గాడి చిన్నతల్లి ఇద్దరూ కలిసి స్త్రీ నిధి రుణాలలోని కొంత డబ్బును అప్పు తీసుకొని అవసరాలకు వాడుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బును మహేశ్వరి అప్పుడప్పుడు బ్యాంకులో జమ చేస్తుండేది. మహిళా మండలి సభ్యుల నిధులను కూడా వీరూ వ్యక్తిగత అవసరాలకు వాడుకునేవారు. కొద్ది రోజులు గడిచిన తరువాత.. “మనం ఈ డబ్బును ఎన్నాళ్లు అని వాడుకుంటాం. నేను వాడుకున్న డబ్బులు ఇస్తాను. నీవు అప్పుగా తీసుకున్న డబ్బులను తీసుకురా.. మొత్తం అంతా లెక్కచేసి బ్యాంకులో వేద్దాం” అని మహేశ్వరి చెప్పింది. ఈ విషయం విన్న చిన్నతల్లికి కోపం వచ్చింది. ఎలాగైనా మహేశ్వరిని చంపితే డబ్బును అడిగేవారు ఉండరు అని భావించింది.
Advertisement
చిన్నతల్లి గత కొంతకాలంగా రేగ గ్రామానికి చెందిన డెంకాడ వాసును ప్రేమిస్తుంది. ఆమె ప్రియుడికి జరిగిన విషయం అంతా చెప్పింది. మహేశ్వరిని ఎలాగైనా చంపాలని వివరించింది. ఈ నేపథ్యంలోనే మే 17న మహేశ్వరినీ కారులో ఎక్కించుకొని విజయనగరం మహిళా ప్రాంగణం సమావేశానికి బయలుదేరారు. ఆ తరువాత అలమండసంత సమీపంలో టిఫిన్ చేసారు. అక్కడ నుంచి మళ్లీ భీమసింగి బ్రిడ్జి కిందకు కారును తీసుకెళ్లి ఆపారు. ఆ తరువాత కారు వెనుక సీటులో కూర్చున్న మహేశ్వరిని ఆమె చున్నీతో గట్టీగా పీకకు ముడి వేసి ఇద్దరూ కలిసి చంపారు. ఆ తరువాత చిన్నతల్లి ఆమెకు ఏం తెలియనట్టుగా విజయనగరం సమావేశానికి వెళ్లింది. మహేశ్వరి శవాన్ని వాసు దూరంగా పడేశాడు. ఈనెల 18న మృతదేహం వెలుగులోకి వచ్చింది. చిన్నతల్లి తన మీద అనుమానం రాకుండా ఫోన్ లొకేషన్స్, ఎలాంటి సమాచారం బయటపడకుండా జాగ్రత్త పడింది. ఆమె ప్రియుడు, మరో ప్రియుడు కొరాడ సాయికుమార్ తో కలిసి దూరంగా వెళ్లిపోవాలని సిద్ధమైంది చిన్నతల్లి. ఈ తరుణంలోనే పోలీసులకు చిన్నతల్లిపై అనుమానం వచ్చింది. ఆమెను లక్కవరపుకోట మండలం గంగుబూడి కూడలి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకొంది. మిగిలిన ఇద్దరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని కొత్త వలస జూనియర్ సివిల్ జడ్జీ ముందు హాజరు పరచగా.. రిమాండ్ విధించినట్టు డీఎస్పీ వెల్లడించారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్న రూపాలి బరువ ఎవరో తెలుసా ?
జబర్దస్త్ బ్యూటీ దీప్తి సునైనా గృహప్రవేశం.. ఫొటోస్ అదిరిపోలా..!!