Advertisement
సాధారణంగా ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే అసలు వద్దు అనుకునే చాలా మందే ఉన్నారు. కొంత మంది కడుపులో ఉండగానే మట్టు పెట్టిన ఘటనలు కూడా మనం చాలా చూస్తేనే ఉన్నాం. కొందరూ మాత్రం ఆడపిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ తమ కూతుర్లు ఉన్నతంగా ఎదగాలని చూస్తుంటారు. ఈ తల్లిదండ్రులు కూడా తమ కూతురిని చదివించారు. ఉన్నత చదువులు చదువుతానంటే విదేశాలకు పంపించారు.
Advertisement
తమ బిడ్డను విదేశాలకు పంపించడం వారికి తలకు మించిన భారం అయినప్పటికీ కుమార్తె మీద ఉన్న ప్రేమతో వారు అంగీకరించి పంపించారు. బిడ్డ భవిష్యత్ బాగుంటే చాలు అనుకున్నారు. ఆమె చదువు కోసం ఉన్న ఇంటిని అమ్మీ మరీ విదేశాలకు పంపించారు. ఆ తల్లిదండ్రులు తన మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే ఆ అమ్మాయి మాత్రం వారు జీవితాంతం ఏడ్చినా తీరని బాధను బహుమతిగా ఇచ్చింది. లండన్ బ్లూమ్స్ బెర్రీ ఇన్ స్టిట్యూట్ లో చదువుతున్న బసవరాజ్ శ్రావణి (27) ఈనెల 10న తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన బసవరాజ్ విజయ, రమేష్ దంపతులకు కూతురు శ్రావణి (27). ఈమె ఉన్నత విద్య చదివేందుకు లండన్ కి వెళ్లింది. శ్రావణి తండ్రి లారీ డ్రైవర్. తల్లి గృహిణి. బిడ్డ ఉన్నత చదువుల కోసం సొంతింటినీ అమ్మీ మరీ విదేశాలకు పంపించారు. తన కోసం, తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటుందని భావించిన శ్రావణి ఈ సంచలన నిర్ణయానికి తీసుకుందని బంధువులు అభిప్రాయపడుతున్నారు. తమ బిడ్డ భవిష్యత్ కోసం ఇంటిని అమ్మితే ఆ బిడ్డ ప్రాణాలు తీసుకొని తమ ఆశలనే కాకుండా తమ భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చింది అంటూ రోధిస్తున్నారు శ్రావణి తల్లిదండ్రులు. లండన్ లోని వరంగల్ ఎన్నారై ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జాయింట్ సెక్రెటరీ ప్రవీణ్ బిట్ల, ఉమెన్ వింగ్ సెక్రటరీలు ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి శ్రావణి మృతదేహాన్ని భారత్ కి పంపించారు. కొంత మేరకు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం కూడా చేసినట్టు సమాచారం.
మరికొన్ని ముఖ్య వార్తలు :
పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడాల్సినవి ఇవే..!!
ఇద్దరు ప్రియుళ్లతో కలిసి యువతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!