Advertisement
What is the Meaning of LXI, VDI, ZXi Written on back side of Cars: సాధారణంగా మనం నిత్యం రక రకాల కార్లను గమనిస్తూనే ఉంటాం. ఎప్పుడూ వాటి మీద ఉండే LXI,VDI అని ఇలా రక రకాల అక్షరాలతో కేటగిరీలుగా చేయబడి ఉంటాయి. అసలు ఆ అక్షరాలు ఎందుకు రాయబడి ఉంటాయి. మరి వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది మాత్రం ఎవరైనా అంతగా పట్టించుకోరు. మరి మనం కారు కొనడానికి షోరూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్ పర్సన్స్ మనకి చెబుతారు. ఈ మోడల్ lxi, vxi, zxi అని వింటాం. కానీ దాని అర్థం ఏంటో అనేది మాత్రం అస్సలు ఆలోచించం. ఈ రోజు మనం ఈ అక్షరాల అర్థం ఎంటో ఇప్పడు మనం తెలుసుకుందాం.
Advertisement
కారు కొనేటప్పుడు జాగ్రత్త పడడం, కార్ల పేర్ల కింద కొన్నింటి మీద Lxi అని, మరికొన్నింటిమీద VDi అని, ఇంకొన్నింటి మీద LDi లేదా ZDi అని రకరకాలుగా రాసి ఉంటాయి. వాటిని మీరెప్పుడైనా గమనించారా? వాటిని బట్టి కారు యొక్క స్టేటస్ ను చెప్పొచ్చు. అవి ఏంటి అంటే.. Lxi & LDi లో L అంటే బేసిక్ మోడల్. X అంటే పెట్రోల్ వెహికల్ అని అర్థం. D అంటే డీజిల్ వెహికల్ అని అర్థం. i అన్నింటికీ కామన్ గా వాడే సింబల్. Vxi & VDi ఇందులో V అంటే మీడియం లెవెల్ అని.. అంటే బేసిక్ కంటే ఎక్కువ టాప్ మోడల్ కంటే తక్కువ అని అర్థం.
Advertisement
ZXi & ZDi ఇందులో Z అంటే టాప్ మోడల్ అని అర్థం. X అంటే పెట్రోల్ వెహికల్ అని అర్థం. D అంటే డీజిల్ వెహికల్ అని అర్థం. i అన్నింటికీ కామన్ గా వాడే సింబల్. ఈ పద్ధతిని మారుతి కంపెనీ మాత్రం ఫాలో అవుతుంది. మిగతా కంపెనీకి చెందిన కార్లు వారి వారి పద్ధతిని ఫాలో అవుతుంటాయి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ఈ పెళ్లి కార్డు చూస్తే ఆశ్చర్యపోక ఉండరు..!
తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూస్తున్నారని యువతి ఏం చేసిందో తెలుసా ?