Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య రాధ మృతి కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుతఈ కేసులో రాధ బాల్య మిత్రుడు కాశిరెడ్డిని నిందితుడిగా భావించారు పోలీసులు. డబ్బులు ఇస్తానని చెప్పి.. రాధను తీసుకెళ్లి చంపేశాడని భావించారు. స్నేహితుడిని నమ్మి కాశిరెడ్డికి.. సుమారు 80 లక్షల రూపాయలు ఇచ్చారు రాధ దంపతులు.
Advertisement
ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. కాశిరెడ్డి ఇలా చేశాడని అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అసలు విలన్ ఎవరో తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
రాధ, మోహన్ రెడ్డి భార్య భర్తలు. వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. రాధకి చిన్నప్పటి స్నేహితుడు కాశిరెడ్డితో పెళ్లి తరువాత కూడా పరిచయం ఉంది. కాశిరెడ్డి ఉద్యోగాన్ని కోల్పోవడంతో సొంతంగా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నానని చెప్పి రాధ దంపతుల వద్ద రూ.80లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
ఆ డబ్బులు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా జరుపుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో రాధ మరణించడంతో డబ్బులు ఇవ్వలేక రాధని తిరిగిరాని లోకాలకు పంపించాడని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ భావించారు. కానీ ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.
Advertisement
ఆ డబ్బులు తిరిగి అడిగే విషయంలో.. రాధ , మోహన్ రెడ్డి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. రాధ , కాశిరెడ్డికి మద్దతుగా మాట్లాడడంతో మోహన్ రెడ్డికి ఆమె మీద అనుమానం మొదలైంది. రాధకు కాశిరెడ్డితో సన్నిహిత సంబంధం ఉందని భావించిన మోహన్ రెడ్డి. కాశిరెడ్డి పేరు మీద ఒక సిమ్ తీసుకున్నాడు.
అతని పేరుతోనే తన భార్యతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కాశిరెడ్డి పేరు మీద చాట్ చేస్తున్న మోహన్ రెడ్డి. డబ్బులు ఇస్తాను రమ్మని రాధకు మెసేజ్ చేశాడు. దీంతో నిజంగానే కాశిరెడ్డి తనకు డబ్బులు ఇస్తాడని భావించిన రాధ మే 19వ తేదీన ఆమె స్వగ్రామం నుంచి కనిగిరి వచ్చింది. ఆ తర్వాత ఆమెను బలవంతంగా కారులో తమతో పాటు తీసుకెళ్లి.. తీవ్రంగా హింసించి చంపినట్టు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. రాధ మరణించిన తరువాత కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండడంతో తొలుత అందరి అనుమానం అతని మీదకే వెళ్ళింది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
కార్లపై ఉండే ఈ ఇంగ్లీషు అక్షరాల గురించి మీకు తెలుసా ?
అంత్యక్రియల సమయంలో కుండలో నీరు పోసి రంద్రాలు పెట్టి పగలగొట్టడానికి కారణం ఏంటో తెలుసా ?