Advertisement
సాధారణంగా మనల్ని మోసం చేసేవారు ఉంటారు. మోసపోయే వారు ఉన్నంత వరకు మోసం చేసే వారు ఉంటూనే ఉంటారు. మోసాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా మోసం చేస్తుంటారు. డబ్బులు, బైకులు, బంగారం, ఆభరణాలు ఇలా రకరకాల మాఫియా గురించి మనం వింటాం. కానీ కొత్తగా పంక్షర్ మాఫియా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ? ముఖ్యంగా అక్రమంగా డబ్బులను సంపాదించడం కోసమే రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తాజాగా పంక్షర్ మాఫియాను అస్త్రంగా ఎంచుకుంటున్నారు. అసలు ఈ పంక్షర్ మాఫియా ఏంటి ? దీని లక్ష్యం ఏంది అనే విషయాలు మీకు తెలియాలంటే ఈ స్టోరీ వినాల్సిందే.
Advertisement
బెంగళూరు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మేకులు దర్శనం ఇస్తున్నాయి. ఆ రోడ్డు గుండా వెళ్తున్నటువంటి పలు వాహనాలు పంక్షర్ అవుతున్నాయి. వాస్తవానికి ఆ మేకులను కొందరూ ఉద్దేశపూర్వకంగానే వేయడం గమనార్హం. పంక్షర్ షాపు ఉన్న చోటుకి దాదాపు కిలోమీటర్ దూరంలో రహదారులు, కూడళ్ల వద్ద చిన్న మేకులు, మొనదేలి ఉన్న తీగలను వేస్తున్నారు. ఇవి కుచ్చుకోగానే టైర్లు, ట్యూబ్ లు పంక్షర్ అవుతున్నాయి. మరో ఛాన్స్ లేకపోవడంతో ఆ మార్గంలో ఉన్న పంక్షర్ షాపుల్లోనే రిపేర్ చేసుకుంటున్నారు.
Advertisement
ఇది అదునుగా భావించి పంక్షర్ షాపు వారు డబ్బులు దండుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ రోడ్డులో ఎక్కువగా ఫంక్షర్లు అవుతున్నాయని.. రోడ్డుపై మేకులు గుచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆనేపాళ్య, నంజప్ప, కూడలి, అపేరా జంక్షన్ చుట్టు పక్కల నిత్యం కిలోకు పైగా మేకులు, ఇనుప తీగలను పోలీసులు ఈ మధ్య కాలంలో సేకరించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే.. దీనికి చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు పోలీసులు. కొందరూ ప్రయాణికులు పంక్షర్ షాపు గిరాకీ కోసం ఇలా కూడా మోసం చేస్తారా అని చర్చించుకోవడం విశేషం.
మరికొన్ని ముఖ్య వార్తలు :
కార్లపై ఉండే ఈ ఇంగ్లీషు అక్షరాల గురించి మీకు తెలుసా ?
పెళ్లి అయిన తరువాత ప్రియుడిని నమ్మి రూమ్ కి వెళ్తే ఏం జరిగిందంటే ?