Advertisement
టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. రాజమౌళి అక్టోబర్ 10, 1973లో జన్మించారు. ఈయన తల్లి దివంగత రాజానందిని, తండ్రి కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. భార్య రమా రాజమౌళి. కూతురు మయూఖా, కుమారుడు కార్తికేయ కలరు.
Advertisement
తొలుత రాజమౌళి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. AVM రికార్డింగ్ థియేటర్లో కూడా పని చేశారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహకారంతో శాంతినివాసం డైలీ సీరియల్స్ తో దర్శకుడిగా ఫస్ట్ బ్రేక్ పొందాడు.
ఇక ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి RRR వరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.
స్టూడెంట్ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి,యమదొంగ, మగధీర, మర్యాదరామన్న, ఈగ, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్, RRR వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరైనా సినిమా మాత్రం సూపర్ హిట్ అవ్వాల్సిందే అనే ఫార్మాట్ లో సినిమా ఉంటుంది.
రాజమౌళితో సినిమా తీసిన హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.
Advertisement
రాజమౌళి RRR చిత్రానికి 2022 న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్ లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. 80వ గోల్డెన్ గ్లోబ్ లో తెలుగు సినిమా RRR లోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది.
టైమ్ మ్యాగజైన్ ద్వారా 2023లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన టాప్ 100లోపు దర్శకులల్లో రాజమౌళి పేరుని లిఖించుకోవడం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పెళ్లైన నెల రోజులకే.. నవ వధువు ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. ప్రమాదం జరగడానికి కారణం ఇదేనా ?
పెళ్లై ఇద్దరూ పిల్లలు.. ఈ మహిళ ఇలా చేస్తుందని అస్సలు ఊహించి ఉండరు..!