Advertisement
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు వచ్చిన తరువాత జనాలు అలవాటు పడిపోయారు. ముఖ్యంగా మొబైల్ లో వీడియోలు చూసి ఫుల్ ఎంటర్టైన్ మెంటికి అలవాటు పడ్డారు. ఏదైనా ఒక వస్తువును, అంశాన్ని చాలా క్షుణ్ణంగా గమనించడం.. ఒకదానిపై ఏకాగ్రత నిలపడం అనే ఓర్పు చాలా మందిలో తగ్గిపోతుంది. చిన్న చిన్న సరదా ఆటలను ఆడటం ద్వారా మీరు మీ ఏకాగ్రత కి పదునుపెట్టవచ్చు. కింది ఫొటోలకు ఉన్న తేడాలు ఏంటో గమనించండి. ఒకవేళ మీరు సమాధానాలు గుర్తించలేకపోయినట్టయితే కింద మీకు సమాధానం ఇచ్చాం చూసేయండి.
Advertisement
మోనాలిసా
సాధారణంగా మోనాలిసా పెయింటింగ్ తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కానీ కింద రెండు ఫొటోలు ఇవ్వబడ్డవి.. ఇందులో ఒరిజినల్ ఫొటో ఏదో కనిపెట్టండి. ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పండి. దాదాపు 99 శాతం ఫెయిల్ అవ్వవచ్చు. జూమ్ చేస్తే కానీ అసలు విషయం తెలియదు.
తెలియదా అయితే ఆన్సర్ చూడండి. బ్యాక్ గ్రౌండ్ లో, మోనాలిసా చేతికి ఉన్న రింగ్ ని గమనించండి.
లండన్ బస్సు
కింద ఇవ్వబడిన రెండు స్టిల్స్ లో ఉన్న తేడాలు ఏంటో గుర్తించేందుకు ప్రయత్నం చేయండి. మీకు ఏమి కనిపించలేదా ? ఈ ఆన్సర్ ని చూడండి.
గడియారంలో ఉన్న సమయంలో కాస్త డిఫరెంట్ గా ఉంది చూడండి. అదేవిధంగా మేఘాలు, పోల్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి.
ఓల్డ్ వుమన్:
Advertisement
ఈ కింద ఉన్నటువంటి ఫొటోలో ఓ వృద్దురాలు కెమెరా వైపు చూసి నవ్వుతోంది. ఈ ఫొటోలో కూడా మూడు చిన్న చిన్న తేడాలున్నాయి. అవి ఏంటో చెప్పేయండి చూద్దాం.
అవి ఏంటో మీరు గమనించారా ? ఒకటి ఆమె చేతికి ఉన్న వాచ్, చైర్ కి ఉండాల్సిన కోడు, అదేవిధంగా బ్యాక్ గ్రౌండ్ లో కూడా బ్లూ పేపర్ పై ఉన్న డిజైన్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.
పాములు ఆడించే వ్యక్తి:
కింద పాములను ఆడించే వ్యక్తి ఉన్నఫొటోను చూశారా ? ఈ రెండు ఫొటోలలో ఉన్న తేడాలు ఏంటో గమనించారా ?
మీకు కనిపించలేదా? తలపాగా, పైపు, పాము యొక్క తోకను గమనించండి. తేడా ఏంటో మీకే అర్థమవుతుంది.
కిటికీ దగ్గర అమ్మాయి
ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫొటోలో ఓ అమ్మాయి కిటికి వద్ద నుంచొని బయటికీ చూస్తోంది. అయితే ఆ ఫొటోలలో తేడాలను మీరు గమనించారా ?
చంద్రుడు మరియు గోడ అడుగున ఉన్న చిన్న రంద్రం ఉంది గమనించండి. మీకే తెలిసిపోతుంది. ఇలాంటివి గమనించడం వల్ల మీ మెదడుకి పదును అవుతుంది. ఇలాంటివి మరన్నీ పరిశీలించి మీ మెదడుకు పదును పెట్టుకోండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పెళ్లైన నెల రోజులకే.. నవ వధువు ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!