Advertisement
ప్రస్తుతం సమాజం ఎక్కడికి పోతుందో అంతుచిక్కడం లేదనే చెప్పాలి. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో ఊహించడమే కష్టం అయిపోయింది. మంచి వారు చెడ్డవారుగా, చెడ్డవారు మంచి వారుగా మారిపోతున్నారు. కొంత మందిపై సినిమాలు, సీరియల్స్ ప్రభావం బాగానే పడుతుందనే చెప్పాలి. తాజాగా ఓ సంఘటన మగధీర సినిమా డైలాగ్ మాదిరిగానే జరిగింది. నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదు అనే విధంగా.. తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటున్న ప్రియుడిపై దారుణానికి ఒడిగట్టింది ఓ యువతి. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. కర్ణాటక కలబురిగి జిల్లా అఫ్జల్ పూర్ కి చెందిన జ్యోతి దొడ్డమని బెంగళూరులో నర్సుగా పని చేస్తుంది. ఆమెకు విజయ్ కుమార్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. విజయ్ చామరాజపేటలోని ఓ షాపులో ఫొటో ఎడిటర్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ప్రేమలో ఉన్న సమయంలో వీరు చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. ఏకాంతంగా పలుమార్లు కలుసుకునేవారు. దాదాపు ఐదేళ్ల నుంచి రిలేషన్ లో ఉంటున్నారు. జ్యోతికి గతంలోనే పెళ్లి జరిగింది. ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టి ఆమె రిలేషన్ కొనసాగిస్తుంది. రెండేళ్ల కిందట జ్యోతికి పెళ్లి జరిగిందనే విషయం విజయ్ కి తెలిసింది. అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. జ్యోతిమాత్రం విజయ్ ని విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదు. కలిసి ఉందాం అంటూ అతనిపై ఒత్తిడి తీసుకొస్తుంది. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 7 నెలల కిందట విజయ్ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
Advertisement
దాదాపు ఆరు నెలల కిందట విజయ్ రూమ్ లోకి వచ్చింది జ్యోతి. తన రూమ్ లోకి రావడంతో విజయ్ తన ఫ్రెండ్ రూమ్ కి మారిపోయాడు. అప్పుడప్పుడు జ్యోతిని కలుస్తుండేవారు. ఇటీవలే విజయ్ కి వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. మే 23న బెంగళూరుకి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు జ్యోతి విజయ్ కి ఫోన్ చేసింది. నీతో మాట్లాడాలి.. రమ్మని చెప్పింది. ఆమె మాట కాదనలేక వెళ్లాడు. వీరిద్దరి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. తాను నీతో ఉండలేనని.. నాకు పెళ్లి జరిగిందని జ్యోతితో చెప్పాడు విజయ్. ఈ విషయం విన్న జ్యోతి తట్టుకోలేకపోయింది. ఆ రోజు రాత్రి విజయ్ నిద్రలోకి జారుకోగానే అతనిపై వేడి నీళ్లు పోసింది. ఆ తరువాత బీరు బాటిల్ తో కొట్టింది. గదిలో నొప్పితో గిలగిల్లాడుతుండగా.. బయటి తలుపు వేసి వెళ్లిపోయింది. విజయ్ సహాయం కోసం కేకలు వేయడంతో ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశాడు. గాయాలతో ఉన్న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. విజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ఈ ఫొటోల్లో ఉన్న తేడా ఏంటో మీరు చెప్పగలరా ? అలా చేస్తే సులభంగా కనుక్కోవచ్చు..!
పెళ్లైన నెల రోజులకే.. నవ వధువు ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!