Advertisement
నిండు నూరేళ్లు కలకాలం బతకాల్సిన భార్య భర్తలు కూడా పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వివాదాలతో కొందరూ విడిపోతున్నారు. మరికొందరూ క్షణిక ఆవేశంలో తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. మరికొందరూ భర్తను చంపడం, ఇంకొందరూ భార్యను చంపడం ఇలా రకరకాలుగా వ్యవహరిస్తున్నారు. భార్య, భర్తల విలువ అసలు వారు తెలుసుకోవడం లేదనే చెప్పాలి.
Advertisement
కట్టుకున్న భర్తను లేదా భార్యను వదిలించుకోవడం ఎంతకైనా తెగించేస్తున్నారు.ఇందుకు ఒక ఊదాహరణ ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రాధ అనే యువతిని స్నేహితుడు చంపేశాడని అందరూ భావించారు. కానీ ఆమె భర్తనే ఆమెపై అనుమానం పెంచుకొని కాలయముడిగా మారాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
కొత్తగా పెళ్లి చేసుకున్న వరుడు సెలవు రోజు కావడంతో అత్తగారింటికి వచ్చాడు. ఇక ఆ మరుసటి రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్లితే. సూరజ్, కల్పన నూతన వధూవరులు. వీరికి పెళ్లి జరిగి కేవలం 3నెలలు అవుతుంది. ఓ కళాశాలల సూరజ్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి శారీరకంగా కల్పనను వేధిస్తున్నాడట సూరజ్. ఈ బాధను భరించలేక.. భర్తను లేకుండా చేయాలనుకుంది భార్య కల్పన.
Advertisement
ఆదివారం సెలవు రోజు కావడంతో అత్తగారింటికి వచ్చాడు సూరజ్. ఈ తరుణంలో భార్య కల్పన భర్తను వాకింగ్ వెళ్దామని పొలం వద్దకు తీసుకెళ్లింది. పొలాల్లోకి వెళ్లగానే.. అక్కడే కాపుకాసుకొని ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో సూరజ్ పై దాడి చేశారు. ఒంటిపై ఉన్న నగలను కూడా దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తొలుత దోపిడి వల్లనే సూరజ్ ని చంపినట్టు భావించారు పోలీసులు. కానీ పోలీసుల విచారణలో భార్య అతన్ని Ha* చేయించిందని వెల్లడి అయింది. తనను మానసికంగా హింసించినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఒప్పుకుంది కల్పన. ప్రధాన నిందితురాలైన కల్పనను తలేగావ్ దభాడే పోలీసులు అరెస్టు చేశారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
నా భర్త ఆ యువతికి గర్భవతిని చేశాడు.. పోలీసులను ఆశ్రయించిన నటి..!
మీకు ఆర్థిక ఇబ్బందులా ? అయితే ఐదు సోమవారాలు శివుడికి ఈ పూజ చేసి చూడండి..
విషాదంలోనూ చిల్లర వ్యక్తుల చేతివాటం..వాటిని కూడా వదలకుండా..!