Advertisement
ఈ మధ్య కాలంలో జరిగే సంఘటనల గురించి ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే పలువురు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మ తిట్టిందనో.. నాన్న కొట్టిండనో.. లేకపోతే ఫోన్ పోయిందనో.. ప్రియురాలు మాట్లాడటం లేదనో.. పరీక్షలో ఫెయిల్ అయ్యామనో.. స్నేహితుడితో గొడవ జరిగిందనో ఇలా రకరకాల సిల్లీ రీజన్స్ తో నిండు నూరేళ్లు బతకాల్సిన వారు టీన్ ఏజ్ లోనే ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు తీరని వేధనను మిగిల్చి ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నారు. తరచూ.. ఇలాంటి వార్తలు మనం నిత్యం వింటూనే ఉన్నాం.
Advertisement
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ శివారు ప్రాంతం అయినటువంటి పఠాన్ చెరులో చోటు చేసుకుంది. పక్కింటి వాళ్లు తిట్టినా.. భర్త పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి చెందిన ఓ మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రామచంద్రాపురం బొంబాయి కాలనీకి చెందిన శిరీష పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేష్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి జరిగి మూడున్నర సంవత్సరాలు అవుతుంది. వీరికి ఇద్దరూ పిల్లలు. ఆదివారం సాయంత్రం శిరీష పెద్ద కూతురు పల్లవి.. పొరుగింట్లో ఉండే పిల్లలు గొడవపడ్డారు. పిల్లల గొడవ కాస్త పెద్దల వరకు వెళ్లింది. పక్కింటి వారు శిరీషతో గొడవపడ్డారు. వెంటనే విషయాన్ని భర్త గణేష్ కి ఫోన్ చేసి చెప్పింది.
Advertisement
ఇక ఆతరువాత రాత్రి భర్త ఇంటికి వచ్చిన తరువాత.. పక్కింటి వాళ్లు నన్ను తిట్టినా పట్టించుకోవా..? అంటూ భర్తను నిలదీసింది. అసలు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని భర్తతో వాగ్వాదానికి దిగింది. తనను ఎవ్వరూ తిట్టినా.. భర్త పట్టించుకోవడం లేదని మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలను తీసుకుంది. తన కూతురు మృతిపై అనుమానం ఉందని తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. కేవలం శిరీష మాత్రమే కాదు.. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎంత మంది అవగాహన కల్పించినప్పటికీ క్షణిక ఆవేశంలో నిండు ప్రాణాలను తీసుకుంటుండం గమనార్హం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఐదేళ్ల పాటు ప్రేమించి..పెళ్లి పత్రిక కూడా రాయించుకొని.. చివరికీ ఏం జరిగిందంటే ?