Advertisement
నందమూరి తారక రామారావు గారు గొప్ప నటుడు, ప్రజానాయకుడు అన్న విషయం మనకి తెలుసు. ఆయన గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగుతో పాటుగా ఎన్టీఆర్ తమిళ హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. మంచి పేరుని తెచ్చుకున్నారు. రాముడు పాత్ర నుండి కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో కూడా అందరిని బాగా మెప్పించారు.
Advertisement
ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పేరు తో రాజకీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా పని చేశారు. అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గురించి ఎక్స్ ఐపీఎస్ నరసయ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు వాటికోసం ఈరోజు మనం చూద్దాం.
ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవలేదని నరసయ్య చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయడు గురించి నాకు చాలా బాగా తెలుసు అని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ రెండవసారి సీఎం అయినప్పటికీ లక్ష్మీపార్వతి ఆమె ఆయన లైఫ్ లోకి వచ్చారు. ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో సేవ చేయడానికి వచ్చాను అని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ గెలిచిన తర్వాత రాజకీయాల్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయ్యారు ఎన్టీఆర్ గారి పరిపాలనలో ఆమె జోక్యం చేసుకున్నారు.
Advertisement
ఆమె నచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం వంటివి కూడా జరిగాయని నరసయ్య అన్నారు. అలానే కొంతమందిని సస్పెండ్ చేయించాలని కూడా లక్ష్మీపార్వతి చూశారని నరసయ్య అన్నారు. మెజారిటీ వాళ్ళని కాదని సస్పెండ్ చేస్తున్నారేంటని పార్టీ వాళ్లు కూడా అన్నారు. అయితే కొంతమంది వెళ్లి ఎన్టీఆర్ ని ఈ విషయం గురించి ప్రశ్నించగా ఆయన నా భార్య జోక్యం చేసుకుంటే తప్పేంటి అన్న తీరులో ఉన్నారని నరసయ్య అన్నారు.
ఒకవేళ కనుక ఇలాంటివి జరిగితే అశోక్ గజపతిరాజు వంటి వాళ్ళని ఎన్నుకుంటామని పార్టీ వాళ్ళు చెప్పేసారట. వైస్ రాయ్ హోటల్ లో గొడవ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఒక్కరు వెళితే ఏమి జరిగి ఉండేది కాదు కానీ లక్ష్మీపార్వతి కూడా వెళ్లారు అని.. ఆమె ఏదో మాట్లాడేసరికి చెప్పులు విసిరారు నిజానికి ఎన్టీఆర్ మీద చెప్పులు విసర్లేదు లక్ష్మీపార్వతి కి విసిరారు అని ఎక్స్ ఐపీఎస్ నరసయ్య అన్నారు.
Also read:
పుష్ప సినిమాలో.. సుకుమార్ ఇంత చిన్న ఫన్నీ లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు..?
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుకి పెద్దశిక్ష వేసిన తల్లిదండ్రులు.. ఏం జరిగింది అంటే..?