Advertisement
ఆది పురుష్ సినిమా కోసం ఇప్పుడు అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆది పురుష్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాముడుగా ప్రభాస్ సీతమ్మ పాత్ర లో కృతి సనన్ నటిస్తున్నారు. హనుమంతుడు పాత్ర కూడా రామాయణంలో ఎంతో ముఖ్యమైనది. సీతా రాముల పాత్రలతో పాటుగా ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కూడా ఉంది. ఆంజనేయుడికి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్ని సినిమాల్లో సీరియల్స్ లో మనం చూసాం.
Advertisement
అలానే పురాణాల్లో కూడా మనం విన్నాం. త్రేతాయుగం నాటి హనుమంతుడు కలియుగంలో కూడా ఉన్నాడనేది హిందువుల ప్రగాఢ నమ్మకం. హనుమంతుడికి మరణం లేదని అంటారు. ఆది పురుష్ సినిమాలో హనుమంతుడు పాత్రలో దేవ దత్త నాగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో తాను నటిస్తున్నాడని తెలిసినప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఆయన గురించి ఆరా తీస్తున్నారు. మరి ఆయన గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
దేవ్ దత్త నాగే ఒక మరాఠీ యాక్టర్ మహారాష్ట్ర లోని అలీ బాగ్ లో జన్మించారు. ఈయన వయసు 42 ఏళ్లు. 2010లో ఈయన పెళ్లి అయింది. ఈయన బిఎస్సి తో పాటుగా ఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు. 2011లో వీర్ శివాజీ లో తానాజీ పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత ఓం రౌత్ తీసిన తానాజీ మూవీ లో మరాఠా యోధుడు సూర్యాజీ పాత్ర చేసి మరో సారి ఆకట్టుకున్నారు. పలు మరాఠి టీవీ సీరియల్స్ లో కూడా నటించారు.
మరి కొన్ని సినిమాల్లో నటించారు. ఆది పురుష్ సినిమాలో అత్యంత కీలకమైన హనుమంతుడి పాత్ర కోసం ఓం రౌత్ ఎంచుకున్నారు. దీంతో అందరి ఫోకస్ కూడా ఈయన మీద ఇప్పుడు పడింది. హనుమంతుడి పాత్ర లో నటించడం కోసం ఎంతగానో శారీరకంగా కష్టపడ్డారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్ల లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి హనుమంతుడు పాత్రలో ఎలా మెప్పించారనేది చూడాల్సి వుంది.
Also read:
ఏ తప్పు చేయలేదు.. కానీ 301 రోజులు జైల్లో.. అసలేం అయిందంటే..?