Advertisement
చాలామంది అమ్మాయిలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళకంటే బయటకు వెళ్లి పని చేసే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్టల షాపులో పనిచేసే ఒక మహిళ గురించి ఇప్పుడు చూద్దాం. ”నా వయసు 30 ఏళ్లు. ఎప్పుడు డ్యూటీ చేసుకున్నట్టే ఈరోజు కూడా డ్యూటీ చేసుకున్నాను.
Advertisement
ఉదయం నుండి కూడా ఒక్కటే వాన అలా పడుతూనే ఉంది ఇప్పుడు కూడా వర్షం అలానే పడుతోంది. బస్టాండ్ దగ్గర బస్ కోసం చూస్తున్నాను నా బట్టలు తడిసిపోయాయి. ఇంతలో బస్సు వచ్చింది బస్సు ఎక్కేసాను. వింతగా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా నన్నే చూస్తున్నారు. అయితే తర్వాత నాకు అర్థమైంది నా డ్రెస్ తడిసిపోవడంతో అందరి దృష్టి నా మీద పడిందని. అది వింతగా కాదు చాలా రోతగా ఉందని.
ఇంకేముంది హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఒక స్కార్ఫ్ ని తీసుకుని ఒళ్లంతా కవర్ చేసుకున్నాను. కవర్ చేసుకున్నా కూడా ఇంకా కొంత మంది ఎగాదిగా నన్నే చూస్తున్నారు. నేను దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఈ లోగా నాకు ఒక ఫోన్ వచ్చింది. పాపకి నిప్పు అంటుకుని ఒళ్లంతా కాలిపోయిందని చెప్పారు ఇదే విషయాన్ని ఓనర్ కి చెప్పేసి నేను ఇంటికి వెళ్దాం అనుకున్నాను అరగంట పాటు ఎదురుచూస్తున్న బస్సు రాలేదు.
Advertisement
వర్షం మాత్రం విపరీతంగా పడుతోంది. మా పాపకి ఒళ్లంతా కాలిపోయిందని నాకు ఒక పక్క భయం.. టెన్షన్ తట్టుకోలేక ఒక క్యాబ్ ని బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాను ఒకపక్క పాపకి ఎలా ఉంది.. చిట్టి తల్లి కాలిన బాధని ఎలా తట్టుకోగలదు.. ఇలా ఎన్నో ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మరొక పక్క ఈ డ్రైవర్ భయంకరమైన చూపులు. అతను చూస్తే అసలు మంచివాడనే అనిపించలేదు.
మళ్లీ ఒకసారి స్కార్ఫ్ ని సర్దుకున్నాను దాంతో అతని దృష్టి రోడ్డు మీద వెళ్లే ఆడవాళ్ళ మీద పడింది. ఈ క్యాబ్ వాడు నన్ను సేఫ్ గా తీసుకెళ్తాడా అని ఒకపక్క మరొక పక్కన చిట్టి తల్లి ఎలా ఉందని ఆలోచన ఆఖరికి హాస్పిటల్ వచ్చింది. ఆ డ్రైవర్ మీద నాకు ఫుల్లుగా కోపం ఉంది అయినా కూడా అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి గబగబా నేను హాస్పిటల్ కి వెళ్ళాను. నన్ను కామాపు చూపులు కాల్చితే నా కూతుర్ని మంటలు”..
Also read:
కన్న తల్లినే చంపేసిన కసాయి కూతురు ! ఇలా కూడా ఉంటారా ? ఇందులో ట్విస్ట్ ఏంటంటే ?