Advertisement
ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలియదు కానీ చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది ఈ రోజే నా జీతం డబ్బులు పడ్డాయి. హాస్పిటల్ లో ఉన్న నాన్న కోసం మందులు పట్టుకుని వెళుతున్నాను.. సడన్గా ఒక వ్యక్తి నా చేతిలో ఉన్న మందులు సంచిని నా పర్సు ని కూడా లాక్కుని పారిపోయాడు ఈరోజు జీతం రావడంతో డబ్బులు అన్నీ కూడా పర్స్ లోనే పెట్టుకున్నాను. అక్కడ కూర్చుని నేను ఏడుస్తున్నాను. ఇంతలో నా చుట్టూ జనం చేరారు ఎవరు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
Advertisement
మందులు లేకుండా నాన్న దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు ఇంటికి వచ్చేసాను ఉదయాన్నే ఎలాగైనా మందులు పట్టుకుని నాన్న దగ్గరికి వెళ్లాలని అనుకున్నాను. అలా ఆలోచిస్తూ రాత్రి నిద్ర పోలేదు. ఉదయాన్నే మా ఇంటి అరుగు మీద చూస్తే పోయిన మందులు నా పర్సు కనబడ్డాయి. ఎవరు పెట్టారు అని ఇరుగుపొరుగు వారిని అడిగాను కానీ ఎవరూ కూడా మాకు తెలియదు అని చెప్పారు తర్వాత రోజు అరుగు మీద చూస్తే చాలా పండ్లు కనబడ్డాయి.
Advertisement
తర్వాత రోజు చీర, వంట సామాన్లు ఇలా రోజుకొకటి కనపడేవి. ఎవరు పెట్టారు అనేది అడిగితే ఎవరికి తెలియదు అని చెప్పేవారు. ఇక 15 రోజులు ఇలా గడిచింది 16వ రోజు నిద్రపోకుండా ఇంటి ముందు గోడ దగ్గర కూర్చుని అలా చూస్తూ ఉన్నాను. రాత్రి రెండు గంటలకి ఒక వ్యక్తి నెమ్మదిగా వచ్చి అరుగు మీద గాజులు పెట్టాడు వెంటనే ఎవరు నువ్వు మాకు ఎందుకు సహాయం చేస్తున్నావ్ అని అడిగాను..
పర్సుని కొట్టేసిన దొంగని నేనే ఎవరికి పుట్టానో తెలియదు దొంగతనం చేస్తూనే నేను పెరిగాను. పర్సు కొట్టేసి పారిపోయిన తర్వాత రోడ్డు మీద ఏడ్చిన ఏడుపులు విన్నాను ఎంతో బాధ వేసింది. మీ తండ్రి కోసం మీరు పడే ఆవేదన అర్థమైంది అని దొంగ నాతో చెప్పాడు. మీ ఏడుపు నన్ను మార్చేసింది ఇప్పుడు దొంగతనం చేయడం లేదు. కష్టపడి పని చేసుకుంటున్నాను. ఆ డబ్బుతోనే మీకోసం ఇవన్నీ తీసుకు వస్తున్నాను అని అతను చెప్పేసరికి గాజులు వేయించుకుని భార్యని అయిపోయాను. ఐదేళ్లుగా మేము సంతోషంగా జీవిస్తున్నాము.
Also read:
”నిండుగా కప్పుకున్నా.. అయినా కూడా ఆ చూపులు”… ఈ మహిళా బాధని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!
ఆదిపురుష్ లో హనుమతుడిగా నటించిన దేవ్ దత్త నాగే ఎవరు..? బ్యాగ్రౌండ్ ఏమిటి..?