Advertisement
ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఆమె గురించి మర్చిపోయి మరి ఒకరితో సంబంధం పెట్టుకోవడం ఇలా ఎన్నో మోసాలు మనం వింటూనే ఉంటాం. వార్తల్లో కూడా తరచూ మనకి ఇటువంటి వార్తలు కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా అక్కని పెళ్లి చేసుకోవడం తర్వాత అక్కని మోసం చేసి సొంత చెల్లెల్ని ప్రేమించడం ఆఖరికి పెళ్లి చేసుకున్న భార్యని అలా వదిలేసి వెళ్లిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
Advertisement
నిజానికి మూడు ముళ్ళు వేసిన తర్వాత భార్యని ప్రేమిస్తూ కలకాలం భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు తోడు నీడలా ఉండాలి. దాపరికాలు పనికిరావు. గౌరవిస్తూ ఉండాలి. ఒకరి కోసం మరొకరు నిలబడాలి. కానీ భార్యను మోసం చేయడం లేదంటే భర్తను మోసం చేయడం వంటివి అసలు మంచివి కావు. కుటుంబ కలహాలు వస్తూ ఉంటాయి. తీవ్రతకి దారితీస్తుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక సంఘటన చోటుచేసుకుంది మరి ఇక పూర్తి వివరాలు చూద్దాం…
Advertisement
ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరవాత మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే మరదలికి మరొకరితో పెళ్లి కుదిరింది. తట్టుకోలేకపోయాడు. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన పెదపూడి సత్యనారాయణ (33) మేనమామ పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి సాయి శ్రీనివాస అనే బ్యాండ్ ట్రూప్ ఉంది. ఆ ట్రూప్ లో మరదలు పాటలు పాడేది. వీళ్ళ మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇప్పుడేమో ఆమె కి పెళ్లి ఫిక్స్ అయింది. తట్టుకోలేకపోయాడు.
ఆమె ని హత్య చేయాలనీ అనుకున్నాడు. ఓ రోజు మాట్లాడాలని పిలిచి గ్రామంలోని కానూరి సత్యనారాయణ పామాయిల్ తోట దగ్గర కత్తితో గొంతుపై కోసేశాడు. చనిపోయిందని కోండ్రుపాడు రైల్వే ట్రాక్ దగ్గరకి అతను వచ్చి తన సోదరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి. అతనేమో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పాడు. ఆమె పోలీసులు కి చెప్పింది. రైల్వే ట్రాక్ దగ్గర మృతదేహం దొరికింది. పామాయిల్ తోటల్లో రక్తపు మడుగుల్లో ఆమె ని హాస్పటల్ కి తీసుకెళ్లారు. కోలుకుంటోంది.
Also read:
లండన్లో హైదరాబాద్ అమ్మాయి పై బ్రెజిల్ యువకుడు దాడి.. తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు..!
మేనరికం పెళ్లి చేసుకోవచ్చా..? పుట్టబోయే బిడ్డల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి..?
మీసాల ఆదిపురుష్ తప్పేమి కాదు.. ఇది చూస్తే.. ఔను నిజమే తప్పేముంది అనిపిస్తుంది..!