Advertisement
రామాయణానికి సంబంధించిన అంశాలతో ఎన్నో సినిమాలు ఇప్పటికే వచ్చాయి. తాజాగా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ రామయ్య పాత్రలో నటిస్తుండగా కృతి సనన్ సీతమ్మగా ఆకట్టుకున్నారు. హిందీ మొదలు తెలుగు వరకు ఎన్నో భాషల్లో రామాయణానికి సంబంధించిన సినిమాలను తీసుకు వచ్చారు. అలానే సీరియల్స్ కూడా వచ్చాయి. 1992లో జపనీస్ ఫిలిం మేకర్ యుగాసాకో రామాయణాన్ని ప్రొడ్యూస్ చేసి దర్శకత్వం వహించారు.
Advertisement
అనిమీ వెర్షన్ లో ఈ సినిమా వచ్చింది. దీని టైటిల్ ఏమిటంటే ”Ramayana: The Legend of Prince Rama”. అరుణ్ గోవిల్ ముఖ్య పాత్ర పోషించారు. హిందీ మరియు ఇంగ్లీషు రెండింటిలోనూ ఈ యానిమేటెడ్ మూవీ వచ్చింది. రావణుడిగా అమ్రిష్ పూరి, సీతగా నమ్రతా సాహ్ని నటించగా కథకుడిగా శతృఘ్న సిన్హా వ్యవహరించారు. ఇంగ్లీష్ వెర్షన్‌లో రాహుల్ బోస్, పెరల్ పదమ్‌సీ, సైరస్ బ్రోచా వంటి వారు పోషించారు. మాల్కం ఇన్ ది మిడిల్‌లో నటించిన బ్రయాన్ క్రాన్స్టన్ కూడా దీనిలో నటించారు.
Advertisement
అయితే రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా జపాన్ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల్ని పొందింది కానీ ఇండియాలో మాత్రం మూడేళ్ల పాటు దానిని రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇండియాలో దీన్ని బ్యాన్ చేశారు. దానికి కారణం ఏంటంటే బాబ్రీ మసీదు అల్లర్ల సమయంలో దీనిని రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇబ్బందవుతుందని తీసుకు రాలేదు. హిందీ వెర్షన్ లో చివరికి 1995లో దూరదర్శన్ లో దీన్ని ప్రచారం చేశారు. ఈ రెండు వెర్షన్లు ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి.
Also read:
డీజిల్ బైకులని, స్కూటీలని ఎందుకు తయారు చేయరు..? కారణం ఏమిటి అంటే..?
ఈ అల్యూమినియం బాక్సులు ఎలా పని చేస్తాయి.. ఎందుకు రైల్వే ట్రాక్స్ మీద వీటిని పెడతారు..?