Advertisement
ఈరోజుల్లో చాలా మంది ప్రేమ పెళ్ళిళ్ళని చేసుకుంటున్నారు. పెద్దలు చెప్పిన వాళ్ళని చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు పోనీ ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళ ఆనందంగా ఉన్నారంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రేమించిన తర్వాత పెళ్లి వరకు వెళ్లకుండానే చాలామంది మోసపోతున్నారు. ప్రేమించిన తర్వాత పెళ్లి అవ్వకుండానే వివిధ కారణాల వల్ల బ్రేకప్ అయిపోతున్నారు. పెళ్ళి వరకు వెళ్ళాక ఏదో ఇబ్బందులు వల్ల విడిపోతున్నారు.
Advertisement
ప్రేమ పేరుతో చాలామంది చనువుగా తిరగడం తర్వాత విడిపోవడం ఇదే ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఒకసారి ప్రేమలో విఫలం అయిపోయిన తర్వాత అబ్బాయి అయినా అమ్మాయి అయినా కుంగిపోవడం సహజం. కానీ మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పడం చాలా తక్కువగా జరుగుతుంది. అయితే మోసం చేసిన వ్యక్తికి ఈ యువతి భలేగా బుద్ధి చెప్పింది. ప్రేమించి ఈమె ని గర్భవతిని చేశాడు తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకుని ఆమెతో కలిసి జీవించాడు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.
Advertisement
ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బొందపల్లికి చెందిన వాడు సాయి. అతనికి ఒక చెల్లెలు ఉంది. చెల్లెలి స్నేహితురాలు తరచు వచ్చేది. ఆమెతో పరిచయం మొదలై… అది కాస్త ప్రేమగా మారింది. గాఢంగా ప్రేమించుకున్నారు. తర్వాత ఆ యువతి ప్రెగ్నెంట్ అయింది. పెళ్లి తర్వాత పిల్లల్నికందామని చెప్పే ఆమె కి అబార్షన్ చేయించాడు. ఎన్నో సార్లు పెళ్లి టాపిక్ డైవర్ట్ చేసాడు.
ఓ రోజు తన రూముకు తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా తాళి కట్టేసాడు. ఆ తరవాత ఆమె ని శారీరకంగా వాడుకున్నాడు. చాలానాళ్ళు ఆమెకి కనపడలేదు. సాయి కి ఇంట్లో పెళ్లి నిశ్చయం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో పెళ్లి. ఈ విషయం తెలిసి ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి సాయిపై కంప్లైంట్ చేసింది. తాళి కట్టే టైం కి ఆమె పోలీసులతో వెళ్ళింది. సాయిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసికెళ్లారు.
Also read:
ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన 8 ఉద్యోగాలు ఇవే..!
అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!
ఆదిపురుష్ లో శూర్పణఖ పాత్ర చేసిన ఆమె ఎవరో తెలుసా..? బయట పెద్ద హీరోయిన్..!