Advertisement
ఇక మీదట 2000 రూపాయల నోట్లు చెల్లవు అన్న విషయం మనకి తెలుసు అయితే వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయాన్ని ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈలోగా 2000 రూపాయల నోట్ల ని మార్చుకోవాలి ఆ తర్వాత 2000 రూపాయలు మీ దగ్గర ఉన్నా కూడా అవి పని చేయవు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నోట్లని రద్దు చేసింది 2000 రూపాయల నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని బ్యాంకుకు వెళ్లి మార్చుకోండి.
Advertisement
సమయం దాటి పోతే అవి చెల్లవు మీరే ఇబ్బంది పడాలి. ఇప్పటి వరకు సుమారు 1.80 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు అయితే అందరిలో ఉండే సందేహం ఏంటంటే ఈ నోట్ల ని ఆర్బిఐ ఏం చేస్తుంది..? ఈ నోట్ల ని దేనికి వాడుతుంది అని.. మీకు కూడా ఈ సందేహం ఉందా.. అయితే వెంటనే క్లియర్ చేసుకోండి.
Advertisement
ప్రాంతీయ శాఖల కార్యాలయాలకి మొదట ఆర్బీఐ పంపిస్తుంది. అక్కడ నకిలీ నోట్లు ఏమైనా ఉన్నాయా..? ఒకవేళ ఉంటే అవి ఎన్ని అనేది లెక్కిస్తారు. యంత్రాల ద్వారా నోట్లు ని పరిశీలిస్తారు. పాడైపోయిన నోట్లు ని వేరు చేసి వాటిని తగలబెడతారు. మిషన్ లో వేసి చించేస్తారు. పాడైపోయిన నోట్లు ని కార్డు బోర్డుల ని తయారు చేయడానికి వాడతారు. బాగున్న నోట్ల ని అయితే ఇతర కరెన్సీ ని తయారు చేయడానికి వాడతారు. ఇలా ఈ కరెన్సీ నోట్లని వాడతారు. గతంలో రద్దు చేసిన నోట్లని కిలోల చొప్పున అమ్మేసారు.
Also read:
ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన 8 ఉద్యోగాలు ఇవే..!
ఆదిపురుష్ లో శూర్పణఖ పాత్ర చేసిన ఆమె ఎవరో తెలుసా..? బయట పెద్ద హీరోయిన్..!