Advertisement
అందరికీ సినిమాలలో నటించే అవకాశం రాదు. కొంతమంది సినిమాలలో నటించడానికి వచ్చి అవకాశాల కోసం ఎంత కొట్టిన ట్రై చేసి అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా తక్కువ మంది కి మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకుని పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయారు. కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్ల గురించి ఈరోజు మనం చూద్దాం..
Advertisement
నమ్రత:
మహేష్ బాబు భార్య నమ్రత సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు చాలా సినిమాల్లో నటించారు. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే మహేష్ బాబుతో వివాహమైంది నమ్రతకి. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటూ నమ్రత ఇంట్లోనే ఉంటోంది.
ఊహ:
శ్రీకాంత్ భార్య ఊహ కూడా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. కానీ ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన గొప్ప హీరోయిన్. 1997లో శ్రీకాంత్ ఊహలపెళ్లి అయింది. తర్వాత సినిమాల్లో నటించలేదు.
అసిన్:
ఈమె కూడా ఇంట్లోనే ఉంటోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. మైక్రోమ్యాక్స్ సంస్థ సీఈఓ రాహుల్ శర్మని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత సినిమాలకి దూరమైంది.
రేణు దేశాయ్:
Advertisement
రేణు దేశాయ్ కూడా మంచి హీరోయిన్. అప్పట్లో సినిమాల్లో నటించింది పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు.
కీర్తి రెడ్డి:
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలో నటించింది కీర్తి రెడ్డి. అక్కినేని సుమంత్ తో పెళ్లి అయ్యింది. ఆ తరవాత విభేదాలు వచ్చి విడిపోయారు. ఈమె కూడా పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించలేదు.
రంభ:
ఈమె కూడా చాలా మంది హీరోయిన్ల లాగే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించలేదు. పెళ్లి అయ్యాక సినిమాలకి దూరం అయిపొయింది.
లయ:
సూపర్ హిట్ చిత్రాల్లో లయ నటించిన అందరినీ ఆకట్టుకుంది అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలకి దూరమైంది. పెళ్లి అయ్యాక ఈమె అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది.
శిల్పా శెట్టి:
శిల్పా శెట్టి కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకుంది శిల్పా శెట్టి. తర్వాత ఈమె సినిమాలు చేయలేదు.
Also read:
సౌందర్య తండ్రి ఆమె చనిపోతుంది అని ముందే చెప్పేసారా..?
భర్త వేధింపులు తట్టుకోలేక.. షాకింగ్ నిర్ణయం.. ఆఖరికి..?
రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ మూవీ ఇదే..!