Advertisement
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. కళ్యాణ్ రామ్ చాలా పలు సినిమాలు లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. నటన తో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. అతనొక్కడే, పటాస్, బింబిసారా మొదలైన సినిమాలతో హిట్లు కొట్టేసారు కళ్యాణ్ రామ్. బింబిసారా సినిమా పెద్ద హిట్ అయింది.
Advertisement
అయితే కళ్యాణ్ రామ్ బింబిసారతో పాటుగా హిట్ అయిన సినిమాలన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ ఒక్క కామన్ పాయింట్ తోనే కళ్యాణ్ రామ్ హిట్ కొట్టేసాడు. అసలు కామన్ పాయింట్ ఏంటి అనేది ఇప్పుడే చూసేద్దాం. అతనొక్కడే సినిమా లో కళ్యాణ్ రామ్ విలన్స్ ని చంపుతూ మిగిలిన వాళ్లకి భయం కలిగేలా చేస్తాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఒక పాజిటివ్ పాయింట్. బింబిసార సినిమా లో కూడా కొన్ని సీన్స్ లో కళ్యాణ్ రామ్ వయెలెంట్ గా ఉంటాడు.
Advertisement
అలానే కళ్యాణ్ రామ్ హరేరామ్ మూవీ విషయానికి వస్తే.. ఆ సినిమా లో నెగటివ్ షేడ్ లో కనపడతాడు. అదే విధంగా కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమా అయితే కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ లో పోలీస్ గా చేస్తాడు. ఆ తర్వాత మార్పు వచ్చిన పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. ఇక పోతే బింబిసార సినిమాలో క్రూరమైన రాజు గా మొదట కనపడతాడు. ఆ తరవాత మంచిగా అవుతాడు. ఇలా కళ్యాణ్ రామ్ హిట్ కొట్టిన అన్ని మూవీస్ లో కూడా మొదట నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసారు. ఇలా ఈ హీరో హిట్ కొట్టిన సినిమాలకి ఈ కామన్ పాయింట్ వుంది. ఇలా కథ వుంటుంటే కళ్యాణ్ రామ్ కి కలిసి వస్తోంది.
Also read:
రామ్ చరణ్ కూతురికి.. ఆ స్టార్ హీరోయిన్ పేరే పెడుతున్నారా..?
పరాయి స్త్రీతో భర్త సంబంధాన్ని పెట్టుకోవడానికి… ముఖ్యమైన 3 కారణాలు ఇవే..!