Advertisement
ప్రతి భార్యాభర్తల మధ్య ఏదో ఒక సందర్భంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక దాని గురించి భార్యాభర్తల మధ్య వాదన మొదలవుతుంది. సర్దుకు పోతే భార్య భర్తలు ఆనందంగా కలకాలం కలిసి జీవించొచ్చు. ఒకరు కాక పోయినా మరొకరు అయినా ఏదో ఒక సందర్భం లో సర్దుకు పోతే ఖచ్చితంగా జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. భార్యా భర్తల మధ్య గొడవ కాస్త విపరీతంగా పెరిగి ఆఖరికి ఇలా జరిగింది.
Advertisement
ఇక ఇప్పుడే దీని గురించి పూర్తి వివరాలను చూసేద్దాం.. బోయిన్పల్లి లోని ఫ్రెండ్స్ కాలనీ కి చెందిన లక్ష్మణ్(50), బీనా (49) ప్రేమించుకున్నారు. ఆ తరవాత వీళ్లిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. 29 సంవత్సరాలు అయ్యింది వీళ్ళ పెళ్లి అయ్యి. కానీ వీళ్ళకి పిల్లలు లేరు. ఇన్నిరోజులైన పిల్లలు లేక పోవడం తో ఇరుగుపొరుగు వాళ్ల మాటల వలన కుమిలిపోయారు. ఆ తరవాత వీళ్ళ మధ్య గొడవలు కూడా మొదలు అయ్యాయి.
Advertisement
గత కొద్ది రోజులుగా ఈ గొడవలు బాగా పెరిగిపోయాయి. అయితే పిల్లల విషయం తో పాటు కుటుంబ కలహాలు కూడా మొదలు అయ్యాయి. ఓ రోజు వీళ్ళ మధ్య గొడవలు మొదలవ్వగా.. లక్ష్మణ్ కి విపరీతమైన కోపం వచ్చేసి భార్య బీనాను చంపేస్తానని హెచ్చరించాడు. అనుకున్నట్టే భార్య మెడకు వైర్ ని బిగించేసి దారుణంగా హత్య చేశాడు. బోయిన్ పల్లి పోలీసులు అక్కడకి చేరుకొని లక్ష్మణ్‌ను అదుపు లోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి బీనా మృత దేహాన్ని తరలించారు.
Also read:
”వారంలో ఆ నాలుగు గంటలే ఆనందం”.. శ్రీజ తో కళ్యాణ్ దేవ్ విడిపోయినట్టేనా..? పోస్ట్ వైరల్..!
దినేష్ కార్తీక్ తో పాటు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా భార్య బాధితులే..!
బాబోయ్.. “ఆదిపురుష్” సినిమాలో ఇన్ని తప్పులా..? రామాయణాన్ని చదివారా..?