Advertisement
ఈరోజుల్లో ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద మాల్స్ ని కట్టేస్తున్నారు. సిటీస్ లో అయితే ఎన్నో మాల్స్ ఉంటూ ఉంటాయి. మాల్స్ లో రకరకాల షాపులతో పాటుగా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి మాల్స్ కి చాలామంది వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు అలానే అక్కడ ఫుడ్ కోర్ట్ కి వెళ్లి ఫుడ్ ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ రొటీన్ గా మనకి తెలిసినవే కానీ చాలా మందికి తెలియని ఒక రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.
Advertisement
ఎప్పుడైనా మనం గమనించినట్లయితే ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళినా కూడా ఫుడ్ కోర్ట్ టాప్ ఫ్లోర్ లో ఉంటుంది అక్కడ మంచి రుచికరమైన ఆహార పదార్థాలు మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే ఎందుకు షాపింగ్ మాల్స్ లో ఫుడ్ కోర్టు ని కేవలం టాప్ ఫ్లోర్ లోనే పెడతారు కింద ఫ్లోర్లో కానీ మధ్య ఫ్లోర్లో కానీ పెట్టొచ్చు కదా.. మాల్స్ టాప్ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ని పెట్టడానికి పెద్ద రీజన్ ఉంది. మరి ఇక కారణం ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
షాపింగ్ మాల్స్ టాప్ ఫ్లోర్ లోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అలా టాప్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు గజిబిజి అవ్వదు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఉండవు. ఇలా ఫుడ్ స్టాల్ ఉండడం వలన ఎవరికి ఇబ్బంది ఉండదు. ఫుడ్ స్టాల్స్ నడిపే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే సేఫ్టీ. అలానే స్పేస్. స్పేస్ ని టాప్ ఫ్లోర్ లో బాగా ఉపయోగించుకోవడానికి బాగా అవుతుంది. అదేవిధంగా సైకాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే కింద ఫుడ్ కోర్ట్ ఉంటే తినేసి వెళ్లిపోతారు.
అదే టాప్ ఫ్లోర్లో ఉంటే దారంతా షాపింగ్ చేసుకుని పైకి వచ్చి తింటారు. ఇంకో కారణం ఏంటంటే షాపింగ్ చేసి చేసి అలసిపోయి వాళ్ళు టాప్ లోకి వచ్చి తింటారు ఒకవేళ కింద ఉంటే షాపింగ్ చేసుకోవడానికి కానీ తినడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించరు. తిన్న వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేయరు. షాపింగ్ చేసిన వాళ్ళు తినరు. అందుకే ఇన్ని విధాలుగా ఆలోచించి మాల్స్ టాప్ ఫ్లోర్ లోనే ఫుడ్ ని పెడతారు.
Also read:
కాబోయే జీవితభాగస్వామిని పెళ్ళికి ముందు.. కచ్చితంగా ఈ 6 విషయాలు అడగాలి..!
చాలా మంది బ్రాహ్మణులు ఎందుకు ఉల్లి, వెల్లుల్లి తినరు..? కారణం ఏమిటి అంటే..?