Advertisement
వాళ్ళ కెరీర్ లో రాజమౌళితో ఒక్క సినిమానైనా చేయాలని చాలా మంది హీరోలు కలలు కంటూ ఉంటారు. దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. రాజమౌళి తన జర్నీని టాలీవుడ్ లో మొదలుపెడితే బాలీవుడ్ హాలీవుడ్ వరకు వెళ్ళింది పేరు మారుమ్రోగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి పేరుని సంపాదించుకున్నారు ఎంతోమందికి ఆయన గురించి తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారారు రాజమౌళి.
Advertisement
మొదటి సినిమాతోనే మంచి హిట్ ని పొందారు రాజమౌళి. అప్పుడెప్పుడో అలా జర్నీ ని మొదలుపెట్టి రాజమౌళి ఇప్పుడు బాహుబలి ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. రెండున్నర దశాబ్దల సినీ కెరియర్లో 13 చిత్రాలని నిర్మించారు. ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్యూర్ లేని దర్శకుడు రాజమౌళి అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు లభించింది రాజమౌళికి.
Advertisement
అయితే రాజమౌళి గురించి ఇవన్నీ మనకు తెలుసు కానీ రాజమౌళి కెరియర్ గురించి చాలా మందికి ఈ విషయం తెలియదు. రాజమౌళి తన కెరీర్ మొదట్లో రెండు పెద్ద సినిమాలని మొదలుపెట్టారు కానీ అవి మధ్య లోనే ఆగిపోయాయి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత రాజమౌళి మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా మైథాలజికల్ డ్రామాని తెర మీదకి తీసుకోవద్దామని అనుకున్నారు.
అంతా సిద్ధం చేసుకున్నారు కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అదే కాకుండా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాష్ తో ఒక భారీ సినిమాని చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. కానీ సూర్య ప్రకాష్ నటించిన డెబ్ల్యూ అప్పటికే డిజాస్టర్ అయిపోయింది అందుకే రాజమౌళి వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇలా రాజమౌళి కెరియర్ లో రెండు పెద్ద సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.
Also read:
మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని.. ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిన నటులు వీళ్ళే..!
ధోని హెల్మెట్ పై భారతీయ జెండా ఎందుకు ఉండదు..? కారణం ఏమిటి అంటే..?
విమానాల్లో కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి..? కారణం ఏమిటి..?