Advertisement
ఈ రోజుల్లో కూడా వేధింపులు వంటివి ఎక్కువ అయిపోయాయి. పెళ్లి జరిగే వరకు అంతా బాగానే ఉందని అనుకుంటుంటారు. కానీ పెళ్లి తర్వాత ఇక అసలు సంగతి మొదలు అవుతోంది. పెళ్లి తర్వాత భార్యను మోసం చేయడం మరొకరితో సంబంధం పెట్టుకోవడం లేదంటే వరకట్న వేధింపులు ఇలా చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. ఇటువంటివి వార్తల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
Advertisement
తాజాగా మరొక వార్త వెలుగు లోకి వచ్చింది. పెళ్లి చేసుకుని ఏడాది మాత్రమే అయింది. భర్త అతని అన్నయ్య, వదిన కట్నం కోసం పెట్టే హింసను భరించలేక ఆ%%త్య చేసుకుని చనిపోయింది ఒక మహిళ. భర్త అతని బంధువులే ఆమె చావుకి కారణమని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. చిక్కబళ్లాపురం కార్కానాపేట లో ఉంటున్న తేజస్విని శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది.
Advertisement
తేజస్విని ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తండ్రికి ఏకైక కూతురు. కొడుకులు కూడా లేరు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అల్లుడు లోహిత్ కి కట్న కనుకూలని ఇచ్చి పెళ్లి జరిపించారు. లోహిత్ కి చిక్కబళ్లాపురం లో ఒక హోటల్ ఉంది అయితే అంతా బాగుందనుకున్నారు కానీ తేజస్విని భర్త అన్నా వదిన వేధించడం మొదలుపెట్టారు. భూమి రాయించుకుని రమ్మని డబ్బులు తీసుకురమ్మని చెప్పారట. వాళ్ళు చేసే హింస గురించి తేజస్విని తల్లిదండ్రులతో చెప్పేది. దీన్ని భరించలేక ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలి బంధువులు హంతకులని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. పోలీసులు లోహిత్ ని అదుపులోకి తీసుకున్నారు.
Also read:
బాహుబలి సినిమాలో.. జక్కన్న చేసిన ఈ చిన్న తప్పుని మీరు గమనించారా..?
మరణించిన వ్యక్తి యొక్క.. ఈ 3 వస్తువులని అస్సలు ఉపయోగించద్దు..!
తొలి ఏకాదశి నాడు ఇలా దీపారాధన చేస్తే.. డబ్బుకి లోటు ఉండదు..!