Advertisement
రైలు ప్రయాణం చేయడం చాలా సులభంగా ఉంటుంది, ఎంతో సౌకర్యంతంగా ఉంటుంది. దూరదూర ప్రాంతాలకి కూడా మనం ఎంతో కంఫర్ట్ గా ట్రైన్ లో వెళ్లి వచ్చేయొచ్చు. ట్రైన్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ఇలాంటివి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించినట్లయితే రైలు బయట కొన్ని గీతలు ఉంటాయి.
Advertisement
చాలా మందికి ఈ గీతల వెనక కారణం ఏంటనేది తెలియదు. రైలు భోగీల బయట చూసినట్లయితే నీలం, తెలుపు రంగులో గీతలు కనబడుతూ ఉంటాయి. ఇవి క్రాస్ గా ఉంటాయి. ఇదేమీ పెయింట్ తో వేసిన డిజైన్స్ కావు దీనికి ప్రత్యేక కారణము ఉంది. మరి ఎందుకు పసుపు, తెలుపు గీతలు రైలు మీద వేస్తారు దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడే చూసేద్దాం.
Advertisement
రైలు కంపార్ట్మెంట్ మీద ఆకుపచ్చ గీతలు కనుక ఉన్నట్లయితే ఆ కోచ్ కేవలం మహిళలకు మాత్రమే అని దానికి అర్థం, ఆ కోచ్ లోకి పురుషులు ఎవరు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ తెలుపు రంగులో లైన్స్ ఉన్నట్లయితే అది జనరల్ కోచ్ అని అర్థం. ఇలాంటి కోచ్లు అన్నీ కూడా ట్రైన్ వెనుక భాగంలో ఉంటాయి.
రిజర్వేషన్ లేని వాళ్ళు ఆ భోగిలో ఎక్కుతారు. ఒకవేళ కనుక పసుపు రంగులో గీతలు ఉన్నట్లయితే ఆ భోగీ లో వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయాణం చేయాలని. అందుకే ఇలా వేరు వేరు రంగులతో లైన్స్ ఉంటాయి దాని ద్వారా మనం ఏ కోచ్ ఎవరికి అని ఈజీగా తెలుసుకోవచ్చు.
Also read:
Samajavaragamana Review: సామజవరగమన స్టోరీ, రివ్యూ & రేటింగ్..!