Advertisement
నందమూరి కుటుంబం నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈతరం నటుల్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ని తొలుత నందమూరి ఫ్యామిలీ బాగా ప్రమోట్ చేసినప్పటికీ ఆయన సినిమాలు మాత్రం అంతగా హిట్ అవ్వలేదు. ఇక తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్. అతనొక్కడే, హరే రామ్, కత్తి, ఓం 3D, 118, బింబిసార వంటి చాలా సినిమాలలో నటించాడు. చివరగా నటించిన అమిగోస్ మూవీలో ఏకంగా మూడు పాత్రలు నటించి మెప్పించాడు కళ్యాణ్ రామ్. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. మనం తెలుసుకుందాం.
Advertisement
కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి. ఈమె వృత్తి రిత్యా డాక్టర్. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి. స్వాతిని పెళ్లి చూపుల్లోనే చూసిన కళ్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని పట్టు పట్టారట. ఆగస్టు 10, 2006న కళ్యాణ్ రామ్, స్వాతిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతులకు అధైత, శౌర్య రామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వాతి కూడా వ్యాపార రంగంలో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది. సొంతంగా ఆమెకు వీఎఫ్ఎక్స్ అనే కంపెనీ కూడా ఉంది.
Advertisement
కళ్యాణ్ రామ్ నటించిన బిబిసారా సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువగా వీఎఫ్ఎక్స్ సంస్థలోనే జరిగాయి.. ఆమె గురించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. టాలీవుడ్ హీరోల్లో కళ్యాణ్ రామ్ కంటే ఎక్కువగా ఆమెకు అక్కినేని నాగార్జున అంటే చాలా ఇష్టమట. ప్రధానంగా నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ మన్మధుడు సినిమాను ఆమె లెక్క లేనన్నిసార్లు చూసిందట. కళాశాలలో చదువుతున్న రోజుల్లో నాగార్జున సినిమా విడుదల అయితే చాలు క్లాసులకు డుమ్మా కొట్టి మరి సినిమాకు వెళ్లేవారట. కొన్ని సందర్భాల్లో కాలేజీ గోడ దూకి మరీ థియేటర్ వద్దకు వెళ్లి సినిమా చూసిందట. ప్రస్తుతం స్వాతి హౌస్ వైఫ్ గానే ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది. స్వాతికి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.