Advertisement
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇటీవలేమరణించిన విషయం తెలిసిందే. విజయనగరంలో షూటింగ్ కోసం వెళ్లిన ఆయన వడదెబ్బ తాకడం.. అప్పటికే మద్యం సేవించి ఉండటంతో విరేచనాలు, రక్తపు వాంతులు చేసుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితి విషమించి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. రాకేష్ మాస్టర్ మరణ వార్తను అందరినీ బాధ పెట్టింది. ముఖ్యంగా డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు చింతించారు. ఆయన స్టూడెంట్స్ శేఖర్, జానీ, గణేష్ పలువురు డ్యాన్సర్లు అంత్యక్రియల్లోనూ పాల్గొన్న విషయం తెలిసిందే.
Advertisement
రాకేష్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమం జూన్ 28న హైదరాబాద్ లోని యూసూఫ్ గూడలో శేఖర్ మాస్టర్, సత్యమాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ..చాలా ఎమోషనల్ అయ్యారు. గతంలో ఆయన గురువుతో గొడవలు అంటూ వచ్చిన వాటికి సమాధానం చెప్పారు. మాస్టర్ తో ఎంతో మంచి అనుబంధం ఉండేదో చెప్పుకొచ్చారు. రాకేష్ మాస్టర్ తో నా జర్నీ దాదాపు ఎనిమిదేళ్ల పాటు కొనసాగింది. మాకు బయట ప్రపంచం ఏంటో అస్సలు తెలియదు.మాస్టర్ గారే మమ్మల్ని తీసుకొచ్చారు. నేను, సత్య ఇద్దరం మాస్టర్ వద్దకు వచ్చాం. మేము విజయవాడలో నేర్చుకొని వచ్చామని చెప్పాం. చాలా మందికి తెలియని విషయమేంటంటే.. మొన్నటివరకు యూట్యూబ్ లో మీరు చూసిన డ్యాన్స్ జస్ట్ 5 శాతం మాత్రమే. ఆయన చాలా మంచి డ్యాన్సర్. ఆయన స్టైల్ చాలా ప్రత్యేకం.
Advertisement
తొలుత నేను ప్రభుదేవాను చూసి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్ కి వచ్చిన తరువాత రాకేష్ మాస్టర్ ఇన్ స్పైర్ చేశారు. ఎప్పుడూ కొరియోగ్రఫీ చేసినా అందరి మూవ్స్ ఒకేలా వచ్చేంత వరకు వదిలిపెట్టేవారు కాదు. ఆయన ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నాం. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ప్రతీ క్షణం ఆయనతోనే గడిపాం. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది కూడా మేమే. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం తెలిసి తెలియనిది రాస్తున్నారు. ఆయనతో మేము చాలా బాగున్నాం. మాస్టర్ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ముగిసిందనుకున్న సమయంలో చిరంజీవి, నాగార్జునకి షాక్.. అసలు ఏం జరిగిదంటే..?
గుండు హనుమంత రావు కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే..?