Advertisement
ఈ రోజుల్లో కట్టుకున్న వాళ్ల గురించి ఆలోచించడం లేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మంచి చెడు ఏంటనేది కూడా చూడడం లేదు. ఈరోజుల్లో మోసాలకి హద్దే లేకుండా పోతోంది. అమ్మాయిలు కూడా అమ్మాయిలు వీక్నెస్ ఉన్న పురుషుల్ని వలలో వేసుకోవడానికి చూస్తున్నారు. డబ్బులు ఫుల్లుగా దోచుకుంటున్నారు. డబ్బు కోసం కొన్నాళ్లు కాపురం చేయడానికి కూడా ఆలోచించడం లేదు. తర్వాత మొత్తం నగలను డబ్బులు తీసుకుని పారిపోతున్నారు.
Advertisement
తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కి చెందిన రేవంత్ పాన్ షాప్ పెట్టుకుని బతుకుతున్నాడు. మొదట అతనికి పెళ్లయింది తర్వాత ఆమెతో విడాకులు అయిపోయాయి. రెండో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోవడానికి షాదీ డాట్ కామ్ యాప్ ని ఉపయోగించాడు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక యువతి తో పరిచయం ఏర్పడింది. ఆమెకి ఇదే మొదటి పెళ్ళాని వరుడు కోసం చూస్తున్నట్లు ఆమె చెప్పింది. తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు.
Advertisement
ఫైనల్ గా ఇంట్లో ఒప్పుకున్నారు ఒక గుడిలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లయిన కొన్నాళ్ళకి అసలు రూపం బయటపడింది. ఆమెకి మందు, సిగరెట్ లు కావాలని వేధించడం స్టార్ట్ చేసింది. వీళ్ళ మధ్య తరచు గొడవలు వచ్చేవి. తన అక్క ఇంటికి వెళ్తానని 70 వేల రూపాయలని, నాలుగు తులాల బంగారాన్ని తీసుకువెళ్లిపోయింది. ఎంతకీ ఆమె రాలేదు దీంతో అతనికి అనుమానం వచ్చింది. గతంలో ఆమెకి మూడు పెళ్లిళ్లు జరగాయని మొత్తం బయటపడింది.
చాలామందితో ఆమెకి పరిచయాలు కూడా ఉన్నట్లు తెలిసింది ఆఖరికి ఆమె ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆమె తన స్నేహితురాలతో విలాసాల్లో మునిగి పోతోంది. అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. రేవంత్ పై దాడి చేయించి వీడియో కూడా తీసింది ఒకవేళ పోలీసులకు చెప్తే సోషల్ మీడియాలో ఈ వీడియోని పెడతామని అతని కుటుంబ సభ్యున్ని కూడా వేధించడం మొదలు పెట్టింది. న్యాయం చేయమని రేవంత్ పోలీసులు దగ్గరికి వెళ్ళాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: