Advertisement
హత్య చేయడం ప్రాణాలు తీసేసి సినిమాటిక్ రేంజ్ లో కథ అల్లడం ఈరోజుల్లో కామన్ అయిపొయింది. అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి చోటు చేసుకుంది. కరీంనగర్ లో ఇది చోటు చేసుకుంది. మరి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లి పోదాం… ఈ సంఘటన చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం చూస్తే కరీంనగర్ సిటీ లో భగత్ నగర్ లో సరిత అనే ఒక మహిళ వుంది.
Advertisement
ఆమెకు పెళ్లి కూడా అయ్యింది. అలానే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వెంకటేష్ కి రూ.25 లక్షల అప్పుగా ఇచ్చింది. కానీ వెంకటేష్ చాలా సమయం తీసుకున్నా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. ఈరోజు, రేపు అంటూ ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇక సరిత ఆమె డబ్బులు రోజూ ఇవ్వమని అడగడం మొదలుపెట్టింది.
Advertisement
ఏం చేయాలో వెంకటేష్ కి అర్థం కాక ఆమె టార్చర్ భరించ లేక ఆమెని హత్య చేయాలనుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఆమెని హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తెలియాల్సిన వివరాలు ఇంకా ఉన్నాయి.
Also read: